పోరాట ఫలితంగానే డిగ్రీ కళాశాల

ABN , First Publish Date - 2022-12-15T23:52:55+05:30 IST

విద్యార్థుల పోరాట ఫలితంగానే డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు వినయ్‌, జిల్లా కన్వీనర్‌ సురేష్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌ పేర్కొన్నారు.

పోరాట ఫలితంగానే డిగ్రీ కళాశాల
స్వీట్లు పంపిణీ చేస్తున్న ఏబీవీపీ నాయకులు

మక్తల్‌, డిసెంబరు 15 : విద్యార్థుల పోరాట ఫలితంగానే డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు వినయ్‌, జిల్లా కన్వీనర్‌ సురేష్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌ పేర్కొన్నారు. మక్తల్‌ పట్టణానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల గురువారం వారు వేర్వేరుగా సంబురాలు జరుపుకున్నారు. ఎవరి కృషి ఫలితంగా డిగ్రీ కళాశాల మంజూరు కాలేదని ఇది విద్యార్థుల పోరాట ఫలితమే అన్నారు. రాస్తా రోకోలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం వంటి అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల పోరాటాన్ని గమనించిన ప్రభుత్వం మక్తల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. అంతకుముందు ఏబీవీపీ నాయకులు స్కాలర్స్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఏఐకేఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భగవంతు, ఐఎఫ్‌టీయూ బుట్టో, అడ్వకేట్‌ దత్తాత్రేయ, పీడీఎస్‌యూ నాయకులు హన్మంతు, సంధ్య, బాలు, గణేష్‌, భూమిక, ఏబీవీపీ నాయకులు శివకుమార్‌, నితిన్‌, రవిరాజ, వినయ్‌, వంశీ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:52:57+05:30 IST