రోజుకొకరు

ABN , First Publish Date - 2022-10-12T04:27:13+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజుకొకరు ఉరికొయ్యపై వేలాడుతున్నారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు, ప్రేమలో విఫలం కావడం ఇలా వివిధ కారణాలతో విగత జీవులుగా మారుతున్నారు.

రోజుకొకరు
నవాబ్‌పేట మండలం కాకర్లపహడ్‌లో కుటుంబ కలహాలతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీ బిడ్డల మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు(ఫైల్‌)

ఉమ్మడి జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ఆత్మహత్య

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు 217 మంది సూసైడ్‌

ఆవేశం... అనుమానం.. ఆవేదనతో బలవన్మరణాలు

అనాథలుగా మారుతున్న పిల్లలు


ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజుకొకరు ఉరికొయ్యపై వేలాడుతున్నారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు, ప్రేమలో విఫలం కావడం ఇలా వివిధ కారణాలతో విగత జీవులుగా మారుతున్నారు. నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు చనిపోయిన ఘటనల్లో వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే వారికి సరైన కౌన్సెలింగ్‌ ఇస్తే కొందరినైనా ఈ ఆత్మహత్యల బారి నుంచి తప్పించొచ్చు.

- మహబూబ్‌నగర్‌


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట బలవన్మరణం చోటు చేసుకుంటోంది. కారణాలేమైన క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బాధిత కుటుంబాలు వీధినపడుతున్నాయి. వివాహేతర సంబం ధాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. భార్య లేదా భర్త వివాహేతర సంబంధాల కారణంగా కాపురాల్లో గొడవలు మొదలవుతున్నాయి. దీని వల్ల హత్యకు దారితీయడమో లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో జరుగుతోంది. దీనికి తోడు అనుమానం పెనుభూతంగా మారి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. ప్రేమ వ్యవహారాల వల్ల కూడా అఘాయి త్యాలకు పాల్పడు తున్నారు. ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడమో.. లేదంటే ప్రేమికు లిద్దరూ తనువు చాలించడం వంటి ఘట నలు ఉమ్మడి జిల్లాలో ఎక్కువగానే జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో వెంటపడి వేధిం చడం వల్ల కూడా మనస్తాపానికి గురై సూసైడ్‌లు చేసుకున్నారు.


నెలలో 60 మంది

ప్రతీ నెల పాలమూరు జిల్లాలో 50 నుంచి 60 వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. షాద్‌నగర్‌ మొదలుకొని జోగు ళాంబ గద్వాల జిల్లా మాన వపాడు వరకు ఆత్మహత్యలతో రైలు పట్టాలు రక్తంతో తడుస్తున్నాయి. నెలలో 10 నుంచి 15 మంది వరకు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుం టున్నారు. వీరిలో ఎక్కువ మంది యువతే ఉండటం గమనార్హం. ఆర్థిక ఇబ్బం దులతోనూ ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. శక్తికి మించి అప్పులు చేసి, వాటిని తీర్చలేని క్రమంలో వచ్చే ఒత్తిడిని అధిగమించ లేక బలవన్మరణాలకు పాల్పడు తున్నారు.


కౌన్సెలింగ్‌ కేంద్రాల బాధ్యత పెరగాలి

కుటుంబ కలహాల వల్ల ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందు లో చాలా వరకు పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్ళిన కేసులే ఉంటున్నాయి. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినప్పుడు అక్కడ ఉన్న అధికారులు బాధ్యతగా వ్యవహరించి, భార్యాభర్తల్లో నమ్మకం పెంచేలా కౌన్సె లింగ్‌ చేయాలి. ఈ పంచాయ తీలంతా రోటీన్‌గా వచ్చేవేనని పోలీసులు ఊదాసీనంగా వ్యవహరిస్తే ఆ కుటుంబల్లో కలహాలు మరింత పెరిగి, ఆత్మహత్యకు కారణమవుతున్న సంద ర్భాలు చాలా ఉన్నాయి. భార్య వెళ్ళి భర్త మీద, లేదంటే వారి కుటుంబ సభ్యుల మీద పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు సరైన తీరులో వ్యహరించకపోతే తమపై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై కోపం మరింత పెరిగి అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మారుతోంది. పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్తే సమస్యకు ఉపశమనం లభించాలే తప్ప.. పుండు మీద కారం చల్లినట్లుగా ఉండకూడదు. ఈ విషయంలో అన్ని పోలీస్‌ స్టేషన్‌లకు స్పష్టమైన ఆదేశాలిచ్చి, బాధితులకు నాణ్యమైన కౌన్సెలింగ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కుటుంబ కలహాలను చాలావరకు నివారించే అవకాశం ఉంటుంది. పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్తే తమకు న్యాయం జరుగుతుందన్న భరోసాను బాధితులకు కల్పించాల్సిన అవసరం ఉంది. 


217 మంది బలవన్మరణం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో జనవరి నుంచి గత సెప్టెంబరు వరకు 217 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గత సెప్టెంబరు ఒక్క నెలలోనే 28 మంది బలన్మరణాలకు పాల్పడ్డారు. అంటే సగటున నెలకు 20 మందికి పైగా సూసైడ్‌ చేసుకుంటున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వారిలో ప్రతీ నెల 12 నుంచి 15 మంది వరకు ఉంటున్నారు. 


మచ్చుకు  కొన్ని ఘటనలు

మహబూబ్‌నగర్‌ మండలం గాజులపేట గ్రామానికి చెందిన ఓ మహిళకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో కాన్పులోనూ మళ్ళీ ఆడపిల్లే పుడుతుందేమోనన్న ఆందోళనలో ఏడు నెలల గర్భిణి సెప్టెంబరు 20న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మహబూబ్‌నగర్‌ మండలం జైనల్లీపూర్‌ గ్రామంలో దయ్యాల కృష్ణయ్య తన కూతురు కాపురానికి వెళ్లనని చెప్పడంతో అవమానంగా భావించాడు. కూతురుకు తల్లి వంత పాడుతుందన్న కోపంతో పెళ్లైన 20 రోజులకే మే 31న నిద్రిస్తున్న కూతురు, భార్యను ఆవేశంలో కొట్టి చంపాడు. జైలుకెళ్ళొచ్చిన ఆయన కొద్ది రోజులకే సెప్టెంబరు 19న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నవాబ్‌పేట మండలం కాకర్లపహడ్‌కు చెందిన రమాదేవి తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని వేఽధిస్తుండటంతో మనస్తాపానికి గురై సెప్టెంబరు 25న తన ఇద్దరు ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ ఇద్దరు పిల్లలు మృత్యువాత పడగా, మరో కూతురు ప్రాణాలతో బయటపడింది.

Updated Date - 2022-10-12T04:27:13+05:30 IST