దళిత జర్నలిస్టులకు దళితబంధు

ABN , First Publish Date - 2022-11-30T23:26:16+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని దళిత జర్న లిస్టులకు సైతం అందజేస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

దళిత జర్నలిస్టులకు దళితబంధు
మన్నాపూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

మద్దూర్‌, నంవబరు 30 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని దళిత జర్న లిస్టులకు సైతం అందజేస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అర్హులైన జర్నలిస్టులకు దళితబంధు ఇవ్వాలని దళిత జర్నలిస్టులు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అర్హులందరికీ దళితబంధు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మన్నాపూర్‌లో ఎమ్మెల్యే పర్యటన..

గ్రామాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మన్నాపూర్‌లో మన ఊరు - మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని వీధుల్లో పర్యటించారు. గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనఖీ చేశారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థను, అంతర్గత రోడ్ల పరిస్థితిని పరిశీలించి గ్రామంలో పారిశుధ్య సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వీరారెడ్డి, మాజీ జడ్పీటీసీలు ఎంపీ సలీం, బాల్‌సింగ్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి, గౌడ సంఘం తాలూకా అధ్యక్షుడు వీరేశ్‌గౌడ్‌, మండలాధ్యక్షుడు వెంకటయ్య, రైతు కమిటీ మండలాధ్యక్షుడు మధు, మండల నాయకులు శివకుమార్‌, బసిరెడ్డి, దిడ్డి వెంకటేశ్‌ యాదవ్‌, అనిల్‌నాయక్‌, విజయభాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:26:16+05:30 IST

Read more