రైతుకు సాగు నీరే సర్వస్వం

ABN , First Publish Date - 2022-03-06T04:26:01+05:30 IST

సాగు నీరే రైతుకు సర్వస్వమని సీఎం కేసీఆర్‌ అనునిత్యం రైతు సంక్షే మం కోసం కృషి చేస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

రైతుకు సాగు నీరే సర్వస్వం
మోటార్లను ఆన్‌ చేసి పూజలు చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

పెద్దమందడి, మార్చి 5 : సాగు నీరే రైతుకు సర్వస్వమని సీఎం కేసీఆర్‌ అనునిత్యం రైతు సంక్షే మం కోసం కృషి చేస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మోజర్ల శార గట్టు ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ఈ పనులు అరబిందో ఫార్మా సహకారంతో రూ. 1.50 కోట్లు, రాంకి రూ.30 లక్షల సీఎస్‌ఆర్‌ ని ధులతో  చేపట్టినట్లు ఆయన తెలిపారు.  3.5 కిలో మీటర్ల పైపులైన్‌ నిర్మాణం ద్వారా సాగునీటి తర లింపునకు ఆరు మోటార్లు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఈ లిప్టు ద్వారా నాలుగు కుంటలు, ఒక చెరు వుకు నిరంతరంగా నీళ్లు అందుతాయని,  సుమారు 600 ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు.  సా గునీరుంటే రైతులు వారి పని వారు చేసుకుంటారని అన్నారు.  కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అధ్యక్షు డు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి, జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, వైస్‌ ఎంపీపీ రఘుప్రసాద్‌, సర్పంచు సునీత, సింగిల్‌విండో చైర్మన్‌ విష్ణువర్ధ్దన్‌రెడ్డి,  టీఆర్‌ ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి,  గట్టు సతీష్‌, రాంకి, అరబిందో ఫార్మాసి సభ్యులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ సభ చరిత్రలో నిలవాలి  

 వనపర్తి అర్బన్‌, మార్చి 5: వనపర్తి జిల్లాలో 8వ తేదీన నిర్వహించే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ చరిత్రలో నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మా ట్లాడారు. కర్నెతండా ఎత్తిపోతలకు  8న తేదీన  వన పర్తిలోనే కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్లు తెలి పారు. నేరుగా సీఎం కేసీఆర్‌ వనపర్తి బహిరంగ సభకు వస్తారని తెలిపారు. మొదట చిట్యాల సమీ పంలో వనపర్తి మార్కెట్‌ యార్డు ప్రారంభోత ్సవం, అనంతరం జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయం,  కలెక్టరేట్‌  భవన సము దాయం ప్రారంభించడంతో పాటు కర్నెతండా ఎత్తి పోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం,  మెడికల్‌ కళాశాలలకు ఒకే చోట శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారని అన్నారు. సాయంత్రం 5.25గంటలకు తిరిగి హైద రాబాద్‌కు వెళ్తారని తెలిపారు.  బహిరంగ సభకు భారీ ఎత్తున తరలిరావాలని, వనపర్తి సభ చరిత్రలో నిలవాలన్నారు. వనపర్తికి మొత్తం దాదాపు రూ.20 కోట్లు ఉపాధి హామీ కింద నిధులు, పనులు మం జూరు అయ్యాయని, తాజాగా రూ.5.15 కోట్లు మం జూరు అయినట్లు తెలిపారు. ఈ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  రేవల్లి మండ లం బండరావిపాకుల సర్పంచ్‌  లక్ష్మమ్మ గతేడాది జూన్‌ 23న  మిద్దె కూలి మృతి చెందింది.  పార్టీ నుంచి  రావాల్సిన రూ.2 లక్షల బీమా చెక్కును  ఆమె  భర్త లింగయ్యకు మంత్రి  అందజేశారు.   

Updated Date - 2022-03-06T04:26:01+05:30 IST