సమన్వయంతో మండల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-07T22:53:06+05:30 IST

అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్ర హాం అన్నారు.

సమన్వయంతో మండల అభివృద్ధి
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం

ఉండవల్లి, డిసెంబరు 7 : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్ర హాం అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ బీసమ్మ అధ్యక్ష తన ఇన్‌చార్జి ఎంపీడీవో రమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సంబంధిత శాఖ అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం ప్రజాప్రతినిధులు పలు సమస్యలు లేవనెత్తారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అందు కు మండల వ్యవసాయ శాఖ అధికారి సురేఖ స్పందిస్తూ శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పర్యటించా రని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసు కుంటామని చెప్పారు. ఎంపీపీ బీసమ్మ మాట్లాడు తూ తక్కశిల గ్రామంలో పది రోజుల నుంచి మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మహిళా సంఘాలను చైతన్య పరచాలని సూచించారు. మండలం ఏర్పాటై ఆరేళ్లు గడిచినా ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు లేవని ఎంపీటీసీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దేవన్న. డీటీ జయంతి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:53:07+05:30 IST