ముగిసిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-19T04:46:28+05:30 IST

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ముగిశాయి. దాంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఆనందంగా ఇంటి బాట పట్టారు. చివరి రోజు కావడంతో పరీక్ష అయిపోయాక కేరింతలు కొట్టారు.

ముగిసిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు
మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల కేంద్రంలో పరీక్ష రాసి బయటికి వస్తున్న విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 18: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ముగిశాయి. దాంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఆనందంగా ఇంటి బాట పట్టారు. చివరి రోజు కావడంతో పరీక్ష అయిపోయాక కేరింతలు కొట్టారు. అందరి ముఖాల్లోనూ సంతోషం కనిపించింది. పరీక్షలు ఎలా రాశా రంటూ ఒకరినొకరు ఆరా తీసుకు న్నారు. మళ్లీ కళాశాలలు తెరిచాక కలుసుకుందామంటూ ఇళ్లకు వెళ్లారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి రోజు పరీక్ష కు 10,288 మంది విద్యా ర్థులు హాజరు కావాల్సి ఉండగా, 9,729 మంది హాజ రయ్యారు. 559 మంది గైర్హాజర య్యారు. పరీక్షలు ప్రశాంతంగా ము గిశాయి.Read more