పేదలకు అండగా సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-10-04T05:04:33+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బీద కటుంబాలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

పేదలకు అండగా సీఎం కేసీఆర్‌
ట్రాక్టర్‌ నడుపుతున్న ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి

 - ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

ధన్వాడ/దామరగిద్ద, అక్టోబరు 3 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బీద కటుంబాలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కులు, ఆసరా పింఛన్ల కార్డలతో పాటు దళితబంధు పథ కం కింద మంజూరైన ట్రాక్టర్లను లబ్ధిదారుకలు ఎ మ్మెల్యే అందజేసి మాట్లాడారు. నారాయణపేట ని యోజకవర్గంలో కల్యాణ లక్ష్మి కింద ఇప్పటి వరకు 8,600 కుటుంబాలు లబ్ధి పొందినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు దళితబంధు పథకం కింద మంజూరైన ట్రాక్టర్లకు ఎమ్మెల్యే నడి పారు. సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి, కో-ఆఫ్షన్‌ స భ్యులు వహిద్‌, సర్పంచ్‌లు నారాయణరెడ్డి, మాధవ రెడ్డి, చంద్రకళ, ఎంపీటీసీ సభ్యులు జట్రం గోవర్ధన్‌ గౌడ్‌, మాధవి, సుదీర్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకు లు భగవంతురెడ్డి, చంద్రశేఖర్‌, చీరాల కొండారెడ్డి, బోర్ల శివాజీ పాల్గొన్నారు. దామరగిద్ద మండల కేం ద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణ ల క్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లా డారు. త్వరలో కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టి ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారన్నారు. ఎంపీపీ నర్సప్ప, విం డో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, పేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భాస్కరకుమారి వెంకట్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.


Read more