మిర్చి రైతులకు పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2022-12-15T22:48:50+05:30 IST

జిల్లాలో మిర్చి పంట వేసి తెగుళ్ల బారినపడి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం కమిటీ సభ్యుడు గోపాస్‌ లక్ష్మణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మిర్చి రైతులకు పరిహారం చెల్లించాలి
కలెక్టరేట్‌ పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు, రైతులు

- రైతుసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 15: జిల్లాలో మిర్చి పంట వేసి తెగుళ్ల బారినపడి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం కమిటీ సభ్యుడు గోపాస్‌ లక్ష్మణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం రైతుసంఘం ఆధ్వర్యం లో మిర్చి రైతులు మిరప చెట్లతో కలెక్టరేట్‌ వద్ద బైటా యించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గో పాస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ జిల్లాలో బిజినేపల్లి, తాడూ రు, తెల్కపల్లి, అమ్రాబాదు తదితర మండలాల్లో ఖ రీఫ్‌లో మిరప పంటను సాగు చేశారని పేర్కొన్నారు. అధిక వర్షాల వల్ల మిరప పంటకు వైరస్‌ సోకి కొంత నష్టం వాటిల్లగా కల్తీ విత్తనాలతో మరింత తీవ్రంగా రైతులు నష్టపోయారని ఆవేదన వ్యాక్తం చేశారు. మిర్చి పంట సాగు చేసే రైతుల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉ న్నారని, ఎకరాకు రూ.14వేలు చెల్లించి సాగు చేసిన కౌలు కూడా చేతికి రాకుండా నష్ట పోయారన్నారు. తక్షణమే జి ల్లా కలెక్టర్‌ వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి ప్ర భు త్వం దృష్టికి తీసుకెళ్లి పంట నష్టం చెల్లించేలా చ ర్యలు తీసుకోవాలని ఆయన కోరా రు. అనంతరం పలు డిమా డ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌ పరిపాలనాధికారికి అందజేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేశ్యానాయక్‌, సహాయ కా ర్యదర్శి నాగరాజుగౌడ్‌, నాయకులు వి.వెంకటేష్‌, ఎండీ. మాలిక్‌, శంకర్‌, బాలరాజు, కురుమయ్య, నారాయణ రెడ్డి, కాశన్న, భగవంతు, ఆనంద్‌, శశిధర్‌రెడ్డి, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T22:48:51+05:30 IST