నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-12-13T23:20:16+05:30 IST

గద్వాల భీంనగర్‌లో కొలువైన సంతానవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
భీంనగర్‌లోని సంతానవేణు గోపాలస్వామి ఆలయం, స్వామివారి మూలవిరాట్టు

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

- ముస్తాబైన సంతాన వేణుగోపాల స్వామి ఆలయం

గద్వాల టౌన్‌, డిసెంబరు 13 : గద్వాల భీంనగర్‌లో కొలువైన సంతానవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచి మూడురోజుల పాటు బ్రహోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా 14న ఉదయం పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, భేరీ పూజ, అనంతరం సాయంత్రం కల్యాణోత్సవం నిర్వహి స్తారు. 15న ఉదయం నిత్యహోమం, రాత్రి స్వామివారి రథోత్సవం, ఊరేగింపు ఉంటుంది. 16న పారువేట, తీర్థావలి, నాగవల్లి, పూర్ణాహుతి, దేవతా విసర్జనతో బ్రహోత్సవాలు ముగుస్తాయని ధర్మక్తలు డాక్టర్‌ విక్రమసింహారెడ్డి, డాక్టర్‌ సుహాసినిరెడ్డి, వి.సంయు క్తమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఉత్సవాలకు అధి క సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

సంస్థానాధీశుల కాలంలో నిర్మాణం

గద్వాల సంస్థానాన్ని 19వ శతాబ్దంలో (1865-1901) 36 ఏళ్ల పాటు రాణి వెంకటలక్ష్మమ్మ పాలించారు. ఆమె దత్తపుత్రుడు రాజా రామభూపాలుడి సోదరుడు భీంరెడ్డి, నాంచారమ్మ దంపతులకు సంతానం లేక పోవడంతో ఆవేదన చెందుతుండేవారు. సంస్థాన పురో హితుల సూచన మేరకు భీంనగర్‌లో సంతాన వేణు గోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత భీంరెడ్డి, నాంచారమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు జన్మించారు. వారిలో పెద్ద కుమారుడు రాజా సీతారాంభూపాల్‌ సంస్థాన పాలకుడిగా కొనసాగారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం బహుళ పక్షంలో స్వామి వారి బ్రహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంద సంవత్సరాలు దాటిన ఈ ఆలయానికి ఇటీవలే వంశపారంపర్య ధర్మకర్తలు మరమ్మతు చేయించారు.

Updated Date - 2022-12-13T23:20:17+05:30 IST