దాడికి నిరసనగా బీజేపీ ధర్నా

ABN , First Publish Date - 2022-01-28T05:41:05+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని చెప్పడానికి నిదర్శనం నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ పేర్కొన్నాడు.

దాడికి నిరసనగా బీజేపీ ధర్నా
నారాయణపేటలో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

నారాయణపేట, జనవరి 27 : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని చెప్పడానికి నిదర్శనం నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ పేర్కొన్నాడు. ఎంపీపై దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు గురువారం నిరసన వ్యక్తం చేసి దాడిని ఖండించారు. ఎంపీపై దాడి జరగడ మంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏపాటిదో అర్థ మౌతుందన్నారు. బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీఆర్‌ఎస్‌ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు తలచుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తిరగలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్‌ వర్ధన్‌, సత్యయాదవ్‌, నర్సిములు, వెంకట్రాములు, బాల్‌రెడ్డి, ఆశప్ప, కృష్ణ, శ్రీనివాస్‌, కౌన్సిలర్లు రఘుపాల్‌, రమేష్‌, సాయిబన్న, భీంసేన్‌, గోపాల్‌, హన్మంత్‌రావు పాల్గొన్నారు. అంతుకుముందు నారాయణపేట రెండో ఎస్‌ఐగా వచ్చిన సుధామాధురిని బీజేపీ నాయకులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. 

ధన్వాడ : ఆర్మూర్‌ పర్యటనకు బయలు దేరిన నిజమాబాద్‌ ఎంపీ అరవింద్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ గురువారం ధన్వాడలో బీజేపీ నాయకులు మూతికి నల్లగుడ్డలు కట్టుకొని నిరస న వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జట్రం గోవర్ధన్‌ గౌడ్‌ మాట్లాడు తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో ఎంపీకి కూ డా రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. ఎంపీ మరియు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో వైస్‌ ఎంపీపీ రాంచంద్రయ్య, జిల్లా కార్య దర్శి మల్లయ్య, లంకాల గోవర్ధన్‌ గౌడ్‌, ఎర్రప్ప, భాస్కర్‌, నాగప్ప పాల్గొన్నారు.Read more