రెండు కాళ్ల ఆవు దూడ జననం
ABN , First Publish Date - 2022-11-05T23:12:23+05:30 IST
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని అన్నారం గ్రామంలో ఓ ఆవు రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది.
వంగూరు, నవంబరు 5: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని అన్నారం గ్రామంలో ఓ ఆవు రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన రైతు సురేందర్‌రెడ్డికి ఉన్న ఓ ఆవుకు శనివారం దూడ జన్మించగా దానికి కేవలం రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆవు దూడ ముందు రెండు కాళ్లు లేకుండా కేవలం వెనుక రెండు కాళ్లతో పుట్టడంతో స్థానికులు ఆవు దూడను వింతగా చూస్తున్నారు. ఎవరైనా ఈ ఆవు దూడను పెంచుకోవాలనుకుంటే ఇస్తానని రైతు సురేందర్‌రెడ్డి తెలిపాడు.