భారత్‌ జోడో యాత్రకు భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2022-10-18T04:19:34+05:30 IST

భారత్‌ జోడో యాత్రకు భారీ బందోస్తును ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

భారత్‌ జోడో యాత్రకు భారీ బందోబస్తు
భారత్‌ జోడో పాదయాత్ర రూట్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ వెంకటేశ్వర్లు

- రూట్‌ మ్యాప్‌ను పరిశీలించిన ఎస్పీ

కృష్ణ, అక్టోబరు 17 : భారత్‌ జోడో యాత్రకు భారీ బందోస్తును ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో పాదయాత్ర ఈనెల 23న మండలంలోని గుడె బల్లూరు పంచాయతీ పరిధిలోకి చేరుకోనుండగా ఎస్పీ వెంకటేశ్వర్లు సోమవారం పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను పరిశీ లించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వాటికి శ్రీహరితో మాట్లాడారు. తెల్లవారుజామున తె లంగాణలోకి చేరుకునే పాదయాత్రకు సుమారు 50వేల మంది కార్యకర్తలతో స్వాగతం పలకనున్న ట్లు వాకిటి శ్రీహరి ఎస్పీకి వివరించారు. కారు పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. బ్రిడ్జి నుంచి నేరుగా మురహరదొడ్డి వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహాం ఆ విష్కరణ స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు సీతయ్య, రాంలాల్‌, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-10-18T04:19:34+05:30 IST