మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-11-15T23:13:38+05:30 IST

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) కార్డియో వెస్కులర్‌ హెల్త్‌ అధికారి, రాష్ట్ర కన్సల్టెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ వస్సే వైద్య సిబ్బందికి సూచించారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతున్న రాష్ట్ర కన్సల్టెంట్‌ డాక్టర్‌ వస్సే

- డబ్ల్యూహెచ్‌వో రాష్ట్ర కన్సల్టెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ వస్సే

- జిల్లా ఆసుపత్రిలోని ఎన్‌సీడీ క్లినిక్‌లో అకస్మిక తనిఖీ

గద్వాల క్రైం, నవంబరు 15 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) కార్డియో వెస్కులర్‌ హెల్త్‌ అధికారి, రాష్ట్ర కన్సల్టెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ వస్సే వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎన్‌సీడీ క్లినిక్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్‌సిడీ క్లినిక్‌, పాలేటివ్‌ కేర్‌లను పరిశీలించి, ఓపీ, అడ్మిషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ మందులు వాడే వారికి ట్రీట్మెంట్‌ కార్డులు ఇవ్వాలని సూచించారు. మూడు నెలలకోసారి టీహబ్‌లో పరీక్షలు నిర్వహించి, రిపోర్టులను ఇచ్చి వివరాలు తెలుపాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మారుతినందన్‌, జిల్లా కో-ఆర్డినేటర్‌ శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

మల్దకల్‌ : గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని డబ్ల్యూహెచ్‌వో డాక్టర్‌ అబ్దుల్‌ వస్సే వైద్యసిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో బీపీ, షుగర్‌ మందులు వాడే వారి వివరాలను సేకరించాలని సూచించారు. ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో నమోదు చేయాలని చెప్పారు. పంపిణీ చేసిన మందులు, స్ర్కీనింగ్‌ టెస్టుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. రికార్డులు అసంపూర్తిగా ఉండటంతో వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ మారుతినందన్‌, డాక్టర్‌ రిజ్వానా తన్వీర్‌, ఎన్‌సీడీ జిల్లా కోఆర్డినేటరు శ్యామ్‌సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:13:39+05:30 IST