స్నేహపూర్వకంగా మెలగాలి

ABN , First Publish Date - 2022-12-30T23:45:07+05:30 IST

పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సమస్యలను, కష్టాలను అడిగి తెలుసు కోవాలని డీఎస్పీ రంగస్వామి సిబ్బందికి సూచించారు.

స్నేహపూర్వకంగా మెలగాలి
సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ రంగస్వామి

- డీఎస్పీ రంగస్వామి

- మానవపాడు పోలీస్‌స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

మానవపాడు, డిసెంబరు 30 : పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సమస్యలను, కష్టాలను అడిగి తెలుసు కోవాలని డీఎస్పీ రంగస్వామి సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయానుసారంగా విధులకు హాజరు కావాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతీ పిటీషన్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్స్‌ నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించారు. ఫిర్యాదులను ఆన్‌లైన్లో నమోదు చేయడంపై వివరించారు. డయల్‌ 100కు కాల్‌ వచ్చిన తక్షణమే పోలీసు సిబ్బంది స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని, బాధితులకు న్యాయం చేయాలన్నారు. పాత నేరస్తు లపై నిఘా ఉంచాలని సూచించారు. పెండింగ్‌ కేసులను త్వరతగతిన పూర్తి చేయాలని, ఫిర్యాదులను పెండింగులో ఉంచొద్దని ఆదేశించారు. పోలీసులు సమయం దొరికినప్పుడల్లా యోగా, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల న్నారు. రౌడీలు, కేడీలు, అనుమానితులు, సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌ ఉండాలని, శిక్షల శాతం పెంచాలని సూచించారు. అనంతరం స్టేషనులోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సంతోష్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-12-30T23:45:07+05:30 IST

Read more