సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-05T04:49:47+05:30 IST

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
బతుకమ్మలతో జడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీపీ

ఎర్రవల్లి చౌరస్తా,అక్టోబర్‌ 4: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని గద్వాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. ఇటిక్యాల మండలంలోని శేకుపల్లి గ్రామంలో మంగళవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఆటపాటలతో చేసిన  సంబురాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, అధికార భాషా సంఘం చైర్మన్‌ మంత్రి శ్రీదేవి, ఉమ్మడి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, ఎంపీపీ స్నేహశ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు హనుమంతురెడ్డి, సర్పంచు రవీందర్‌రెడ్డి, నాయకులు  రాందేవ్‌ రెడ్డి,  ఖఘునాథ్‌రెడ్డి  పాల్గొన్నారు.

Read more