రామ రామ రామ ఉయ్యాలో..

ABN , First Publish Date - 2022-10-01T05:11:06+05:30 IST

బతుకమ్మ పాటలు మారుమోగాయి. మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సాహంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.

రామ రామ రామ ఉయ్యాలో..
అయిజలో నిర్వహించిన వేడుకల్లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే, కమిషనర్‌

- ఉత్సాహంగా బతుకమ్మ సంబురాలు

- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

- తెలంగాణ సంస్కృతికి ప్రతీక : అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం


బతుకమ్మ పాటలు మారుమోగాయి. మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సాహంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.


అయిజ టౌన్‌, సెప్బెంబరు 30 : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో చైర్మన్‌ దేవన్న, కమిషనర్‌ నర్సయ్య, మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే, అధికారులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. 


గద్వాల : గద్వాల మండల పరిధి లోని మేలచెరువు గ్రామంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. మాజీ సర్పంచు వేణు గోపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


రాజోలి : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీడీపీవో సుజాత హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం తుంగభద్ర నదిలో బతుకమ్మలను నిమజ్జ నం చేశారు. 


అయిజ : పట్టణంలోని సంతబజార్‌, బలిజపేటల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌ వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, కిషోర బాలికలు పాల్గొన్నారు.


ఉండవల్లి : మండల కేంద్రంలోని హేమళాంబ రేణుకా ఎల్లమ్మ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాటలు పాడు తూ బతుకమ్మ ఆడారు. అనంతరం మహిళలు బతుక మ్మలను ఎత్తుకొని, రేణుకా ఎల్లమ్మ ఉత్సవ విగ్రహం తో గ్రామంలో ఊరేగింపుగా నిర్వహించారు. ఆ తర్వాత తుంగభద్ర నదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో హేమళాంబ రేణుక ఎల్లమ్మ దేవస్థాన కమిటీ సభ్యులు దుంపల విష్ణువర్ధన్‌ రెడ్డి, వాల్మీకీ రాముడు, అబ్దుల్‌ ఖాదర్‌, కేశన్న తదితరులు పాల్గొన్నారు.

Read more