స్వామియే శరణం అయ్యప్ప

ABN , First Publish Date - 2022-12-17T23:03:04+05:30 IST

స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శనివారం జిల్లా కేం ద్రం మార్మోగింది.

 స్వామియే శరణం అయ్యప్ప
అభిషేకం నిర్వహిస్తున్న అయ్యప్పస్వాములు, పాల్గొన్న మర్రి జమునారెడ్డి, కూచకుళ్ల రాజేష్‌రెడ్డి

- మహా పడిపూజకు హాజరైన ప్రముఖులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 17: స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శనివారం జిల్లా కేంద్రం మార్మోగింది. పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో స్వామివారి మహా పడిపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జి.ఎం.విజయకుమార్‌శాస్త్రి, గోపాల కృష్ణ గురుస్వామి, మడిగెల రంగయ్య గురుస్వామి, తీగల మురళి గురుస్వామి ఆధ్వర్యంలో తెల్లవారు జా మున సుప్రభాత సేవతో అయ్యప్పస్వామి పూజ కార్య క్రమం ప్రారంభమైంది. అనంతరం గణపతి హోమం, ధ్వజారోహణం, స్వామి వారి అభిషేకం, మహా పడి పూజలు వైభవంగా నిర్వహించారు. మహా పడిపూజలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సతీమణి మర్రి జ మునారెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయు డు కూచకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొని స్వామివారికి కలషా భిషేకం, పుష్పాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మ హా పడిపూజలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పా ల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ కల్పన, ఆలయ కమిటీ అధ్యక్షుడు కందూరు తి రుపతయ్య, ప్రధాన కార్యదర్శి సందు మురళీధర్‌, గౌరవ అధ్యక్షుడు ఖానాపురం ప్ర దీప్‌కుమార్‌, కార్యదర్శి ఖానాపురం ప్రవీణ్‌, కోశాధికారి మలిశెట్టి చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షులు జగన్‌, సుందర్‌, శివ, సుదర్శన్‌, పాండు, నరేష్‌గుప్తా, అయ్యప్ప మాల గురుస్వాములు, కన్నెస్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T23:03:05+05:30 IST