Dundubhi river: దుందుభి వాగులో కొట్టుకుపోయిన ఆటో..
ABN , First Publish Date - 2022-07-28T21:06:08+05:30 IST
నాగర్ కర్నూల్ జిల్లా, సిర్సవాడ దగ్గర దుందుభి వాగులో ఆటో కొట్టుకుపోయింది.
నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా: సిర్సవాడ దగ్గర దుందుభి వాగు (Dundubhi river)లో ఆటో (Auto) కొట్టుకుపోయింది. ఆటోలోని ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఆటో దుందుభి వాగు దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతికి ఆటో కొట్టుకుపోయింది. ఆటోను గమనించిన స్థానికులు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కాపాడారు. తాళ్ల సహాయంతో రక్షించారు. సిర్సవాడ, మాదారం మధ్య వాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు కోరారు. గతంలోనూ పలువురు వాగులో కొట్టుకుపోయి చనిపోయారని వారు తెలిపారు.