అధికారమే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-12-15T23:55:30+05:30 IST

తెలంగాణలో 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు.

అధికారమే లక్ష్యంగా పనిచేయాలి
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌

ఊట్కూర్‌, డిసెంబరు 15 : తెలంగాణలో 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు. గురువారం ఊట్కూర్‌లో జరిగిన మండల స్థాయి సమావేఽశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు దేశ రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. అంతకుముందు బీజేపీ జిల్లా కార్యదర్శి ఎం.భాస్కర్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కర్నే స్వామి, మండల ఇన్‌చార్జి బలరాంరెడ్డి, జిల్లా నాయకుడు నర్సింహారెడ్డి మాట్లాడారు. మండలాధ్యక్షుడు రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యలు హన్మంతు, కిరణ్‌ , సర్పంచ్‌ భాస్కర్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్‌, మండల ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు కృష్ణయ్యగౌడ్‌, లక్ష్మణ్‌, ఆశప్ప, కొండన్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:55:33+05:30 IST