ఆశ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-12-15T23:23:26+05:30 IST

ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వడంతో పాటు, సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నరసింహ అన్నారు.

ఆశ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి
కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలు

- కలెక్టరేట్‌ ముందు ధర్నా

- వంటావార్పుతో నిరసన

గద్వాల క్రైం, డిసెంబరు 15 : ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వడంతో పాటు, సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నరసింహ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ముందు ఆశ కార్యకర్తలు గురువారం 48 గంటల వంటవార్పుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో ఆశ వర్కర్ల పాత్ర కీలకమన్నారు. ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రశంసించిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడ్తోందన్నారు. పారితోషికం ఇవ్వకుండా లెప్రసీ సర్వే కూడా చేయిస్తోందన్నారు. పెంచిన 30 శాతం ఏరియర్స్‌ ఇప్పటివరకు ఇవ్వలేదని, అలాగే డ్రస్‌ అలవెన్స్‌, కొవిడ్‌ ఇన్సెంటివ్‌, ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు పద్మ, సునీత, కాంతమ్మ, చెన్నమ్మ, సరస్వతి, నరసమ్మ, భారతి, సుజాత, నాగప్రమీల, సీఐటీయూ అధ్యక్షుడు వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:23:27+05:30 IST