తెలంగాణకు ఐకాన్‌గా

ABN , First Publish Date - 2022-12-02T00:06:28+05:30 IST

మహబూబ్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్క్‌ దేశంలోనే అతిపెద్ద పార్క్‌ అని, దీనిని తెలంగాణకే ఐకాన్‌గా మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. గురువారం కేసీఆర్‌ అర్బన్‌ఎకో పార్క్‌ను మంత్రి సందర్శించారు.

తెలంగాణకు ఐకాన్‌గా
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కేసీఆర్‌ అర్బన్‌ఎకో పార్క్‌

- ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి

వి శ్రీనివాస్‌గౌడ్‌

- బర్డ్స్‌ ఎన్‌క్లోజర్‌పై అధికారులతో సమీక్ష

- సీఎం సభకు జన సమీకరణపై కార్యకర్తలతో సమావేశం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 1 : మహబూబ్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్క్‌ దేశంలోనే అతిపెద్ద పార్క్‌ అని, దీనిని తెలంగాణకే ఐకాన్‌గా మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. గురువారం కేసీఆర్‌ అర్బన్‌ఎకో పార్క్‌ను మంత్రి సందర్శించారు. ఈ నెల 4న కేసీఆర్‌ చేతుల మీదు గా బర్స్డ్‌ ఎన్‌క్లోజర్‌కు భూమి పూజ చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ క్షితిజలతో సమీక్ష నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేచోట దేశ విదే శాలకు చెందిన 800 రకాల పక్షులతో బర్డ్స్‌ ఎన్‌క్లో జర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పక్షుల కిలకిల రావాలతో ఈ ప్రాంతం మరింత ఆహ్లాదకరంగా మారుతుందని చెప్పారు. సందర్శకులకు ఒకేచోట ఎన్నడూ చూడని విధంగా 800 రకాల పక్షులను చూడటంతోపాటు ఇక్కడ వాటర్‌ఫాల్స్‌, వ్యూ పా యింట్‌, సెల్ఫీ పాయింట్‌లను ఏర్పాటు చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ తేజ స్‌ నందలాల్‌పవర్‌, వాస్తుశిల్పి సుద్దాల సుధాకర్‌ తేజ, డీఎఫ్‌వో సత్యనారాయణ పాల్గొన్నారు.

ఫ అనంతరం మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం ప్రారంభించను న్న నూతన కలెక్టరేట్‌, మినీ శిల్పారామం, టీఆర్‌ ఎస్‌ పార్టీ కార్యాలయం, సభ జరిగే ఎంవీఎస్‌ కళా శాల మైదానాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈనెల 4 వరకు అన్ని పనులు పూర్తవ్వాలని ఆదేశించారు.

సీఎం సభను సక్సెస్‌ చేయాలి

ఈ నెల 4న జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తున్నారని, ఈ సందర్భంగా ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభను కార్యకర్తలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయా లని ఆబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎన్నో నిధులు ఇస్తున్నారని, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, జిల్లా కు వస్తున్న ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోరమోని నర్సింహులు, రాజేశ్వర్‌గౌడ్‌, గోపాల్‌ యాదవ్‌, చెరుకుపల్లి రాజేశ్వర్‌, శాంతన్న, వెంకన్న, తాటి గణేష్‌, శివరాజు, వినోద్‌, పోతుల గిరిధర్‌రెడ్డి, కరుణాకర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.

ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 1 : ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ కోరా రు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఎస్‌. వెంకట్‌రావు, ఎస్పీ ఆర్‌. వెంకటేశ్వ ర్లు, ఇతర ముఖ్యమైన అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ముఖ్య మంత్రి మహబూబ్‌నగర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించే నిమిత్తం జిల్లాకు వస్తున్నందున అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయ వంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాలతో పాటు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేకంగా బహిరంగ సభకు హాజరయ్యే వారి కోసం తాగునీరు, ఇతర ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Updated Date - 2022-12-02T00:06:43+05:30 IST