14న కేటీఆర్‌ రాక

ABN , First Publish Date - 2022-10-08T04:50:58+05:30 IST

ఈనెల 14న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారకరామారావు నారాయణపేట జిల్లాకు వస్తున్న దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిచందన అధికారు లను ఆదేశించారు.

14న కేటీఆర్‌ రాక
కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ స్థలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి, కలెక్టర్‌ హరిచందన

- పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

- అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ హరిచందన


నారాయణపేట టౌన్‌, అక్టోబరు 7: ఈనెల 14న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారకరామారావు నారాయణపేట జిల్లాకు వస్తున్న దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిచందన అధికారు లను ఆదేశించారు. శుక్ర వారం సింగారం చౌరస్తాలో ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డితో కలిసి నూతనంగా నిర్మించనున్న కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ స్థలాలను ఆమె పరిశీలించారు. 53 ఎకరాల్లో కలెక్టరేట్‌, ఎస్పీ భవనాల నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తా రని కలెక్టర్‌ తెలిపారు. వీరి వెంట ఎస్పీ వెంక టేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో రాం చందర్‌, అధికారులు నర్సింగం, రాములు, దానయ్య, సునీత, మహేష్‌ తదితరులున్నారు. 

Read more