వీఆర్‌ఏల అరెస్టు, విడుదల

ABN , First Publish Date - 2022-10-12T04:19:15+05:30 IST

వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు నెరవే ర్చాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లోని బాగ్‌లిం గంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద చేపట్టిన మహాగర్జనకు వెళ్తున్న వీఆర్‌ఏలను పోలీ సులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిం చారు.

వీఆర్‌ఏల అరెస్టు, విడుదల
నర్వ పోలీస్‌ స్టేషన్‌లో అరెస్టు అయిన వీఆర్‌ఏలు

మాగనూరు/కృష్ణ/నర్వ/దామరగిద్ద/ఊట్కూర్‌, అక్టోబరు 11 : వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు నెరవే ర్చాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లోని బాగ్‌లిం గంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద చేపట్టిన మహాగర్జనకు వెళ్తున్న వీఆర్‌ఏలను పోలీ సులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిం చారు. ఈ సందర్భంగా జేఏసీ మండల నాయకులు యాదయ్య, వెంకటేష్‌ మాట్లాడుతూ అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కలిగించినా తమ హక్కుల సాధనకు నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 23 మంది వీఆర్‌ఏలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో యాదయ్య, సత్యనారాయణ, వెంకటేష్‌, మ హిపాల్‌రెడ్డి, సురేష్‌, హనుమంతు, రాజేశ్వరి, సునీత, గీతాబాయి, ప్రమీల, మాధవి ఉన్నారు.

- కృష్ణ మండలంలోని వీఆర్‌ఏలు హైదరాబాద్‌ తరలకుండా మంగళవారం తెల్లవారుజామున పోలీ సులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిం చారు. వీఆర్‌ఏల మండలాధ్యక్షుడు మచ్చేందర్‌ మా ట్లాడుతూ పోలీసుల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలే రని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సొంత పూచికత్తుతో వదిలివేశారు. అరెస్టు అయిన వారిలో ఆంజనేయులు, జగదేవ, రఘు, మల్లేష్‌ ఉన్నారు.

- నర్వ మండలం నుంచి హైదరాబాద్‌కు తర లివెళ్తున్న వీఆర్‌ఏలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో వీఆర్‌ఏలు ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ 36 మంది వీఆర్‌ఏలను అరెస్టు చేయడం ప్రభుత్వానికి సిగ్గు చేటు అన్నారు. వీఆర్‌ఏల మండలాధ్యక్షుడు కానాపురం రాములు, సువర్ణ, ఆంజనేయులు, వెంకటయ్య ఉన్నారు.

- దామరగిద్ద మండలం నుంచి హైదరా బాద్‌కు వెళ్తున్న వీఆర్‌ఏలను మంగళవారం తెల్లవా రుజామున పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద ర్భంగా ఆ సంఘం నాయకుడు శ్యామప్ప మాట్లా డుతూ శాంతియుతంగా జరిగే నిరసన కార్యక్రమా నికి వీఆర్‌ఏలు వెళ్లకుండా అరెస్టు చేయడం సరి కాదన్నారు. 15 మంది వీఆర్‌ఏలను అరెస్టు చేసి సొంతపూచికత్తుపై విడుదల చేశారు. ఆ సంఘం నాయకులు నర్సప్ప, ఆంజనేయులు, శ్రీనివాస్‌, నాగమణి, నర్సమ్మ ఉన్నారు. 

- హైదరాబాద్‌లో చేపట్టిన వీఆర్‌ఏల గర్జనకు తరలివెళ్తున్న వీఆర్‌ఏలను మంగళవారం తెల్లవారుజామున ఊట్కూర్‌ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మండల జేఏసీ చైర్మన్‌ శ్రీనివాస్‌తో పాటు నాయకులు తిరుపతి భీంరావు, వెంకటప్ప, శివ, కనకప్ప, నారాయణ, ఆంజనేయులు, గోవిందు, అరుణమ్మ, బన్నమ్మ,  శరణమ్మను అరెస్టు చేసి సాయంత్రం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.  
Read more