కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి
ABN , First Publish Date - 2022-08-09T05:32:16+05:30 IST
భూ సమస్య పరిష్కరించాలని, లేదా కారుణ్య మరణా నికి అనుమతి ఇవ్వాలని హన్వాడ మండలం బు ద్ధారం గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్ వేడుకున్నాడు.

- కలెక్టరేట్లోని ప్రజావాణి
కార్యక్రమంలో బాధితకుటుంబ
సభ్యులు నిరసన
- సమస్యలు అధికారుల దృష్టికి
తీసుకువచ్చి పరిష్కరించుకోవాలి
- కలెక్టర్ ఎస్. వెంకట్రావు
మహబూబ్ నగర్ (కలెక్టరేట్), ఆగస్టు 8 : భూ సమస్య పరిష్కరించాలని, లేదా కారుణ్య మరణా నికి అనుమతి ఇవ్వాలని హన్వాడ మండలం బు ద్ధారం గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్ వేడుకున్నాడు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో తన భార్య సలీమబీ, కొడుకు మహ్మద్ వహీద్తో కలిసి బ్యా నర్ పట్టుకొని రెవెన్యూహాల్ ముందు నిరసన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు మ హ్మద్ జహంగీర్ మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబర్ 20లో 1.8 ఎకరాలు, 21లో 25 గుంటలు తన పేరు మీద ఉందన్నాడు. కానీ, సర్వే నెం బర్ 20లో ఉన్న 1.8ఎకరాలో 21 గుంటల భూమి శోభాసుధాకర్ రెడ్డి పేరున నమోదు అయిందన్నా రు. ఈ విషయంపై తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా, ఆర్డీవో 145 సెక్షన్ను జారీ చేశా రన్నారు. రెండు సంవత్సరాలు అవుతున్నా పోలీ సులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో కలెక్టర్కు తమ సమస్య వివరించేందుకు వచ్చామన్నారు. ఇక్కడ కూడా భూసమస్య పరిష్కారం కాకుంటే ఇంకా తమకు చావే శరణ్యమని కన్నీరుపెట్టారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేందుకే ప్రతీ సోమవారం ప్రతీ మండలంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యలు సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకవెళ్లి ప రిష్కరించుకోవాలని సూచించారు. అప్పటికీ పరి ష్కారం కానట్లైతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి గాని ఫిర్యాదుదా రులు సెల్ టవర్ ఎక్కడం, కిరోసిన్ పట్టుకరా వడం, కారుణ్య మరణాలకు అనుమతి కోరడం లాంటివి అధికారులను బ్లాక్ మేయిల్ చేయడమేనని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. భూ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, పోలీస్ శాఖను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత తహసిల్దారును ఆదేశిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిదంగా పోలీస్ శాఖను కూడా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ప్రజల నుంచి డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, సాంఘిక సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, డబుల్ బెడ్రూమ్లు, రెవెన్యూ భూసమస్యలు, తదితర వాటిపై 73 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.