సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలి
ABN , First Publish Date - 2022-03-06T04:27:29+05:30 IST
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆదివారం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశించా రు.
- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి అర్బన్, మార్చి 5: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆదివారం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశించా రు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో కోఆర్డినేషన్ కమిటీ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 8న సీఎం కేసీఆర్ ముందుగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు వస్తారని, అక్క డి నుంచి రోడ్డు మార్గం ద్వారా వనపర్తి పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో జరిగే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాల శంకుస్థాపన, కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత ్సవం తదిత ర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల ను ఆదివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.