పోలీసు శాఖకు అధునాతన సౌకర్యాలు

ABN , First Publish Date - 2022-12-13T23:12:20+05:30 IST

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖకు అధునాతన సౌకర్యాలను కల్పించిందని వెస్ట్‌జోన్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి అన్నారు.

పోలీసు శాఖకు అధునాతన సౌకర్యాలు
కొదండాపురం స్టేషన్‌ అవరణలో మొక్క నాటుతున్న ఐజీ

- ఐజీ కమలాసన్‌ రెడ్డి

- అలంపూర్‌, కోదండాపురం స్టేషన్ల తనిఖీ

ఎర్రవల్లి చౌరస్తా, డిసెంబరు 13 : ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖకు అధునాతన సౌకర్యాలను కల్పించిందని వెస్ట్‌జోన్‌ ఐజీ కమలాసన్‌రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన కోదండాపురం పోలీస్‌స్టేషన్‌, అలంపూర్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. రిసెప్షన్‌ సెంట ర్‌, స్టేషన్‌ పరిసరాలు, పోలీస్‌ క్వార్టర్లను పరిశీలించి, విలేఖరులతో మాట్లడారు. 1996లో తాను గద్వాల డీఎస్పీగా విధులు నిర్వహించానని గుర్తు చేస్తూ, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అయ్యిందని, ఎర్రవల్లి చౌరస్తా వాణిజ్యకేంద్రంగా మారిందని అన్నారు. పోలీ సు శాఖ ప్రజలకు మంచి సేవలందిస్తూ, వారితో సత్సంబంధాలను కొనసాగిస్తోందన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారన్నారు. గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎస్పీ, జిల్లా పోలీస్‌ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారని తెలిపారు. దీంతో ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరవ అవుతాయన్నారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాంకేతికంగా జరుగుతున్న రికార్టుల నిర్వహణ తీరును పరిశీలించారు. అంతకుముందు ఆయనకు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో ఆయన మొక్క నాటారు. కార్యక్రమంలో ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌, డీఎస్పీ రంగస్వామి, అలంపూర్‌ సీఐ సూర్యనాయక్‌, ఎస్‌ఐలు వెంకటస్వామి, గోకారి, బాలరాజు, శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:12:20+05:30 IST

Read more