బీఆర్‌ఎస్‌లో చేరికలు

ABN , First Publish Date - 2022-12-31T22:55:38+05:30 IST

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామరగిద్ద మండలం చాకలోనిపల్లికి చెంది న వెంకట్‌రెడ్డి, రాంరెడ్డితో పాటు మరో 30 మంది ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్‌ఎస్‌లో చేరారు.

బీఆర్‌ఎస్‌లో చేరికలు
బీఆర్‌ఎస్‌లో చేరిన వారితో ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 31 : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామరగిద్ద మండలం చాకలోనిపల్లికి చెంది న వెంకట్‌రెడ్డి, రాంరెడ్డితో పాటు మరో 30 మంది ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే పార్టీలోకి చేరుతున్నారన్నారు. ప్రభుత్వం అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ తెలంగాణాలోనే రాష్ట్రం ముం దంజలో ఉందన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్నా సాగర్‌కు చెందిన హన్మంతుకు ‘దళిత బంధు’ కింద మంజూరైన షిప్డ్‌ డిజైర్‌ వాహనాన్ని ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి పంపిణీ చేశారు. బలమైన సామాజిక విప్లవానికి ‘దళితబంధు’ నాంది పలుకుతుందన్నా రు. అదే విధంగా సీఎం సహాయ నిధి కింద మంజూరైన అంత్వార్‌కు చెందిన కృష్ణయ్య గౌడ్‌కు రూ.2.25 లక్షల చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

Updated Date - 2022-12-31T22:55:40+05:30 IST