సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-10-18T04:33:32+05:30 IST

ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు
సమస్యలను తెలుసుకుంటున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- ‘ప్రజావాణి’కి 96 ఫిర్యాదులు

గద్వాల క్రైం, అక్టోబరు 17 : ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 96 ఫిర్యాదులు అందాయని, అందులో భూ సమస్యలు, పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఉన్నాయన్నా రు. మల్దకల్‌, కేటీదొడ్డి, రాజోలి, ఉండవల్లి, ఇటిక్యాల మండలాలకు చెందిన పలువురు భూసమస్యలపై ఫిర్యాదులు ఇచ్చారని తెలిపారు. వాటిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక పంపించాలని ఆయా మండలాల తహసీల్దార్లను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఏవో యాదగిరి, అధికారులు మధన్‌మోహన్‌, రాజు, వరలక్ష్మి పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T04:33:32+05:30 IST