బైరి నరేష్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-30T23:54:18+05:30 IST

హిందూ దేవుళ్లను కించపరిచిన నాస్తిక హేతువాద నాయకుడు బైరి నరేష్‌పై కేసు నమోదు చేయాలని ఆత్మకూర్‌ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

బైరి నరేష్‌పై చర్యలు తీసుకోవాలి
వనపర్తి సీఐ ప్రవీణ్‌ కుమార్‌కు వినతిపత్రం ఇస్తున్న వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులు

ఆత్మకూర్‌, డిసెంబరు 30: హిందూ దేవుళ్లను కించపరిచిన నాస్తిక హేతువాద నాయకుడు బైరి నరేష్‌పై కేసు నమోదు చేయాలని ఆత్మకూర్‌ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ చౌరస్తాలో మానవహారం నిర్వహించిన అనంతరం మాజీ ఎంపీపీ శ్రీధర్‌ గౌడ్‌ మాట్లాడారు. కొడంగల్‌ ప్రాంతంలో అంబేడ్కర్‌ సభకు హాజరైన ఆయన హరహర పుత్ర అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించా రు. కనీస జ్ఞానం లేకుండా హిందువుల దేవుళ్లను కించపరచడం ఏంటని ప్రశ్నించారు. అయ్యప్ప స్వా మిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్‌ను తక్షణమే అరెస్టు చేసి పీడీయాక్ట్‌ నమోదు చేయాలని కోరు తూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్ర మంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, లక్ష్మీనారాయణ, సమ్మద్‌, అయ్యప్ప స్వాములు గోవర్ధన్‌, రఘు, ఎస్టీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

అమరచింతలో..

అమరచింత:అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్య లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం అమరచింతలో అయ్యప్ప స్వాములు రాస్తారోకో చేశారు. హిందూ దేవుళ్లను కించపరుస్తు మాట్లాడిన నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గురుస్వామి క్యామ భాస్కర్‌, నర్సింలుగౌడ్‌లు డిమాండ్‌ చేశారు. స్థానిక బస్టాండ్‌ ఆవరణలో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో అయ్య ప్ప స్వాములు అంజి గౌడ్‌, రమేష్‌, శేఖర్‌, పురు షోత్తం గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెబ్బేరులో..

పెబ్బేరు : హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైౖౖరి నరేష్‌ను అరెస్టు చేయాలని డిమాం డ్‌ చేస్తూ శుక్రవారం అయ్యప్పస్వామి భక్తులు, ఇతర హిందూ సంఘాల నాయకులు పెబ్బేరు సుభాష్‌ చౌరస్తాలో ధర్నా చేశారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నరేష్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రామస్వామి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం చౌరస్తా నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వనపర్తిలో...

వనపర్తి రాజీవ్‌చౌరస్తా : హిందువుల మనోభావా లను దెబ్బతీస్తు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులు శుక్ర వారం సీఐ ప్రవీణ్‌ కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అయ్యప్ప ఆలయ సేవా సమితి ఉపాధ్యక్షుడు బీచుపల్లియాదవ్‌ ఆధ్వర్యంలో అయ్య ప్ప స్వాములు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డికు వినతిపత్రం అందించారు. పీడీ యాక్ట్‌ నమోదు చేసి నరేష్‌ను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-30T23:54:18+05:30 IST

Read more