లోతట్టుకు ఏడాదిలోపు పరిష్కారం

ABN , First Publish Date - 2022-10-12T04:40:20+05:30 IST

వర్షాలు వచ్చి నప్పుడల్లా లోతట్టు ప్రాంతాలు జలమవుతున్నా యని, ఏడాదిలో ఆ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని ఆబ్కారి శాఖ మంత్రి డాక్టర్‌ వి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

లోతట్టుకు ఏడాదిలోపు పరిష్కారం
నూతన ఆసరా పింఛన్‌ పత్రాలు పంపిణీ చేస్తున్న మంత్రి, కౌన్సిలర్లు, నాయకులు

- పింఛన్‌దారులకు త్వరలో మెగా వైద్య శిబిరం

- ఆబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

- 17 వార్డుల్లో  కొత్త పింఛన్‌ కార్డుల పంపిణీ

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 11 : వర్షాలు వచ్చి నప్పుడల్లా లోతట్టు ప్రాంతాలు జలమవుతున్నా యని, ఏడాదిలో ఆ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని ఆబ్కారి శాఖ మంత్రి డాక్టర్‌ వి శ్రీనివాస్‌గౌడ్‌  తెలిపారు. లోతట్టు ప్రాం తాల పరిస్థితిపై శాటిలైట్‌ ద్వారా సర్వే చేయిస్తు న్నామన్నారు. నీటిప్రవాహం సాఫీగా సాగేలా యంత్రాంగం లెవెల్స్‌ చెక్‌ చేస్తున్నదని, డైవర్షన్‌ నాలాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. మంగళవా రం పట్టణంలోని 17 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు పసులకిష్టారెడ్డి గార్డెన్‌, అల్మాస్‌ ఫంక్షన్‌హాల్‌, రోజ్‌గార్డెన్‌లలో వేర్వేరుగా సమావేశా లు నిర్వహించారు. నూతనంగా మంజూరైన 1348 ఫించన్‌ కార్డులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసం గించారు. వరద ప్రాంతాల్లో కలిగిన నష్టం గురించి ముఖ్యమంత్రికి వివరించిన వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారని తెలిపా రు. పాలమూరు మునిసిపాలిటీలో ప్రతీనెల 20 వేల మందికి రూ.4.24 కోట్లు పంపిణీ చేస్తున్నామ ని తెలిపారు. ఆసరా పింఛన్‌ దారులకు తొందర లోనే మెగా హెల్త్‌క్యాంప్‌ నిర్వహించి 40 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తా మని తెలిపా రు. ఆసరా పింఛన్‌ కార్డులు ఇచ్చే టపుడు తాము పైరవీ చేశామని దళారులు ఎవరైనా డబ్బులడిగితే వారి పళ్లు రాలగొట్టాలని, నేరుగా వారి వివరాలను తనకు గానీ పోలీసులకు గానీ చెబితే జైలుకు పంపుతామని తెలిపారు. ఇల్లు, ఇతర పథకాలలో ఎవరైనా డబ్బులడిగినా ఆ సమాచారం చెప్పాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసి పల్‌ చైర్మన్‌  కోరమోని నర్సింహులు, నాయకులు తాటి గణేష్‌, పోతుల గిరిధర్‌రెడ్డి, ఆనందర్‌ కుమార్‌గౌడ్‌, రశ్మితప్రశాంత్‌, అనంతరెడ్డి, మోతీలా ల్‌, జాజిమొగ్గ నర్సింహులు, శ్రీనివాస్‌, రాణి, లక్ష్మీదేవి, సంధ్య, శివరాజు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

హన్వాడ మండలం కొనగంటిపల్లి సర్పంచ్‌ బసిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్‌ చెన్నయ్యతో పాటు కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, ధర్మాపూర్‌ ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఊటకుంటకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్‌గౌడ్‌, రమణారెడ్డి పాల్గొన్నారు.

Read more