సీఎం సభకు భారీగా జన సమీకరణ చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T23:33:14+05:30 IST

డిసెంబరు నాలుగున ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర్‌ రావు జిల్లాకు వస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

సీఎం సభకు భారీగా జన సమీకరణ చేయాలి
భూత్పూర్‌లో ముఖ్యనాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే ఆల

- నాయకులను కోరిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

భూత్పూర్‌, నవంబరు 30 : డిసెంబరు నాలుగున ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర్‌ రావు జిల్లాకు వస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆ రోజు నూతన కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహి రంగ సభ నిర్వహిస్తారని, దేవరకద్ర నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలను సమీకరణ చేయాలని స్థానిక నాయకులను ఎమ్మెల్యే కోరారు. బుధవారం భూత్పూర్‌ మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. భూత్పూర్‌ నుంచి మహిళా సంఘాల సభ్యులు, యువకులు భారీ సంఖ్యలో ఎంవీఎస్‌ కాలేజీ మైదానం వరకు పాదయాత్రగా తరలి రావా లని పిలుపునిచ్చారు. ఇటీవల భూత్పూర్‌ మునిసిపాలిటీ జాతీయస్థాయి అవా ర్డు సాధించినందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కేటాయించిన రూ.2 కోట్ల ప్రత్యేక నిధులను చిరకాలం నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులకు కేటాయించాలని మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌కు ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో మునిసి పల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, ఎంపీపీ కదిరె శేఖర్‌ రెడ్డి, కమిషనర్‌ నురూల్‌ నజీబ్‌, సీఐ రజితారెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ నారాయణగౌడ్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు మేకల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సురేష్‌ కుమార్‌గౌడ్‌, వార్డు కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యు డు అజీజ్‌, యువకులు రాకేష్‌గౌడ్‌, బోరింగ్‌ నర్సిములు, రాములు, గడ్డం ప్రేమ్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:33:14+05:30 IST

Read more