నాయకుడంటే పాలకుడు కాదు.. సేవకుడు

ABN , First Publish Date - 2022-12-16T23:39:30+05:30 IST

సమాజంలో నాయకుడంటే పాలకుడు కాదని, సేవకుడని రాష్ట్ర ఆబ్కారిశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

నాయకుడంటే పాలకుడు కాదు.. సేవకుడు
పాస్టర్‌కు కేక్‌ తినిపిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు, డిసెంబరు 16 : సమాజంలో నాయకుడంటే పాలకుడు కాదని, సేవకుడని రాష్ట్ర ఆబ్కారిశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో కులమతాలకు అతీతంగా ప్రజారంజకంగా పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెన్నోనైట్‌ బ్రదరన్‌ చర్చి ఆధ్వర్యంలో ఎంబీసీ మైదానంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకుల్లో మంత్రి హాజరై కేక్‌కట్‌ చేశారు. జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ధి చేయటంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రిస్టియన్‌ భవన్‌ సహా అనేక అభివృద్ధి కార్య క్రమాలు చేసి గతంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించినందుకు మంత్రికి సంఘ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారని తెలిపా రు. కార్యక్రమంలో పాస్టర్‌ రెవరెండ్‌ ఎస్‌.వరప్రసాద్‌, హైదరాబాద్‌నుంచి రెవ.వి.ప్రతాప్‌కుమార్‌ ప్రత్యేక సందేశమిచ్చారు. అనంతరం కేక్‌కట్‌చేసి ప్రజ లకు క్మిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో నూతనంగ నిర్మించనున్న చర్చి నమూనాను ఆవిష్కరించారు. ప్రజలందరు క్యాండిల్‌ వెలిగించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, చెరుకుపల్లి రాజేశ్వర్‌, కౌన్సిలర్‌ గోవిందు, రాజురాణి, నరసింహులు, ఏసుపాదం, పిపి స్వదేశ్‌, టైటస్‌పాల్‌, వైస్‌ చైర్మన్‌ జే.ఐ యోహోన్‌, కోశాధికారి బి.ఐ జేకోబ్‌, ప్రధాన కార్యదర్శి పి.శామ్యూల్‌, సభ్యులు ఆర్‌.ఎష్‌ జోసెఫ్‌, ఆర్‌.కే హీరాంరాయ్‌, డీకన్స్‌ టీ.ఏ స్టీవెన్‌, ఎస్‌.కే స్వామిదాసు, కె.ఎన్‌ పౌల్‌, ఎస్‌.బి అబ్రహాం, ఏ.ఆర్‌ రాజేష్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:39:34+05:30 IST