ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-10-04T05:08:09+05:30 IST

మండలంలోని కర్నీ పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది, డాక్టర్లు, ఆశ వర్కర్లు సోమవారం బతుక మ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా బతుకమ్మ సంబురాలు
పేటలో వీరశైవ లింగాయత్‌ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో..

మక్తల్‌/మద్దూరు/నారాయణపేట టౌన్‌, అక్టోబరు 3 :  మండలంలోని కర్నీ పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది, డాక్టర్లు, ఆశ వర్కర్లు సోమవారం బతుక మ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు తయారుచేసి ఆట పాటలతో అలరించారు.  అనంత రం ఆశ వర్కర్లకు ఎంపీపీ వనజ, కర్నీ ఎంపీటీసీ సభ్యుడు రంగప్ప, సర్పంచ్‌ అక్రమ్‌ చీరలు పంపిణీ చేశారు. డాక్టర్‌ నవీన్‌కుమార్‌, తిరుపతి, హబీబ్‌, వైద్య సిబ్బంది సులోచన, శ్రీధర్‌ పాల్గొన్నారు. మద్దూరు మండల కేంద్రంలోని గ్రామ పం చాయతీ ఆవరణలో బతుకమ్మ సంబురాలు కనుల పండువగా కొ నసాగాయి. ఈ సందర్భంగా మ హిళలు పెద్దఎత్తున బతుకమ్మ ఆడి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. అదే విధంగా నిడ్జింత గ్రా మంలో రెడ్డిసేవాల సమితి ఆధ్వ ర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. అందంగా బతుక మ్మలను తయారు చేసుకొచ్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి 32 ఇంచుల స్మార్ట్‌ టీవీ, రెండో బహుమతి 24 ఇంచుల స్మార్ట్‌ టీవీ, మూడో బహుమతి మిక్సితో అందరికీ బహుమతులు అందజే శారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు అరుణ, లావణ్య, ఎంపీపీ విజయ లక్ష్మి, మాజీ ఎంపీపీ సంగీత, ఎంపీటీసీ సభ్యుడు వెంకటయ్య. ఉప సర్పంచ్‌ యాదవరెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రా మ్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, అంజిరెడ్డి, భరత్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్‌ లింగబలిజ సంఘం నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సింగార్‌బేస్‌ శివలింగేశ్వర ఆలయంలో  మహిళలు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ ఆడారు. అనంతరం కొండారెడ్డిపల్లి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మల్లికార్జునమ్మ, అన్నపూర్ణ, విజయలక్ష్మి, జ్యోతి, వీణ, కరుణ, గీత, రష్మి, మంజుల, సునీత, ఇందువేణి, రజిత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

బతుకమ్మలతో వీఆర్‌ఏల ర్యాలీ

నారాయణపేట రూరల్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రెండు నెలలుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం విడ్డూరమని ఆ సంఘం జిల్లా జేఏసీ కన్వీనర్‌ రాజప్ప, బండారి కృష్ణ పేర్కొన్నారు. సోమవారం తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి ర్యాలీగా జిల్లా కేంద్రంలోని బారంబావి వరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఆ సంఘం జిల్లా కోకన్వీనర్‌ పి.రాజు, వీరప్ప, అశోక్‌, రమేష్‌తో పాటు వీఆర్‌ఏలు పాల్గొన్నారు.Read more