బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

ABN , First Publish Date - 2022-11-30T23:40:14+05:30 IST

జనాభా దామాషా ప్రకారం బీసీల రిజ ర్వేషన్లను 27శాతం నుంచి 50 శాతానికి పెంచాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నరాములు డిమాండ్‌ చేశారు.

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు చెన్నరాములు

- బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నరాములు

వనపర్తి టౌన్‌, నవంబరు 30: జనాభా దామాషా ప్రకారం బీసీల రిజ ర్వేషన్లను 27శాతం నుంచి 50 శాతానికి పెంచాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నరాములు డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జైభీం స్వచ్ఛంద సంస్థ కార్యాలయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. గడిచిన 75 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని, కాలేల్కర్‌ కమిషన్‌ నుంచి అనేక కమిషన్లు వేసి కాలయాపన చేసిన కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు అన్యా యం చేసిందన్నారు. అలాగే బీపీ మండల్‌ కమిషన్‌ బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ ప్రతిపాదన అమలు చేయాలని ప్రయత్నించినా వీపీ సింగ్‌ ప్ర భుత్వాన్ని కూలదోసి రథయాత్ర మొదలు పెట్టి సమస్యను పక్కదారి ప ట్టించిన బీజేపీ ప్రభుత్వం కూడా బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీఎస్‌పీ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 40 రోజుల పాటు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా చేపట్టి 27 శాతం రిజర్వేషన్లను సాధించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రభు త్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను 10శాతం నుంచి 50శాతానికి రిజర్వేషన్‌ సీలింగ్‌ తొలగించడం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని మాయావతి, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ మేరకు స్టీరింగ్‌ కమిటీ వేశారని, త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని అన్నారు. బీసీలంతా ఐక్యమై 50శాతం రిజర్వేషన్‌ సాధించుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఎస్‌పీ ఉపాధ్యక్షుడు చిరంజీవి, గడ్డం మహేష్‌, గట్టు మన్నెం, కురుమన్న, బండ లయ్య, చిట్యాల కురుమూర్తి, నితీష్‌, మన్నెం, మల్లేష్‌చారి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:40:14+05:30 IST

Read more