31 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-08-18T04:15:30+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 3805 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

31 కరోనా కేసులు నమోదు

 మహబూబ్‌నగర్‌, ఆగస్టు 17 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 3805 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నాగర్‌కర్నూలు జిల్లాలో 649 పరీక్షలకు 6, జోగుళాంబ గద్వాల జిల్లాలో 1324 పరీక్షలకు 5, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 45 పరీక్షలకు 4, వనపర్తి జిల్లాలో 1727 పరీక్షలకు 16 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో 60 పరీక్షలు నిర్వహించగా ఎలాంటి కేసులు నమోదుకాలేదు. 

Read more