వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
ABN , First Publish Date - 2022-10-08T04:47:54+05:30 IST
ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన సంఘటన కూసుమంచి మండలం చింతలతండాలో శుక్రవారం జరిగింది.
పెకిలించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు
అభిమానుల ఆందోళన
పోలీసుల హామీతో విరమణ
ఖమ్మం జిల్లా చింతలతండాలో ఘటన
కూసుమంచి, అక్టోబరు 7: ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన సంఘటన కూసుమంచి మండలం చింతలతండాలో శుక్రవారం జరిగింది. గ్రామంలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆరు నెలల క్రితం ఏర్పాటు చేయగా.. ఆ విగ్రహాన్ని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు పెకిలించి పక్కన పడేశారు. ఈ విషయం తెలుసుక్ను వైఎస్సార్‌టీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేఇన స్థలం నుంచి పూర్తిగా పెకిలించారని, విగ్రహాన్ని తిరిగి అదే చోట పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వైఎస్సార్ అభిమానులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు తెలుసుకుని దుండగులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.