జోరుగా యాసంగి

ABN , First Publish Date - 2022-02-19T06:29:57+05:30 IST

జోరుగా యాసంగి

జోరుగా యాసంగి

73 శాతం సాగు పూర్తి   

వద్దన్నా.. ఆగని వరిసాగు

ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 18: జిల్లా యాసంగి వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం వరి వేయవద్దని చెప్పినా నీరు అందు బాటులో ఉన్న ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. దానితో పాటే ఆరుతడి పంటలను కూడా పండిస్తున్నారు. యాసంగిలో ఖమ్మంజిల్లాలో సాధారణ సాగులక్ష్యం 2,20,815 ఎకరాలు కాగా, ఫిబ్రవరి 18నాటికి 1,73,413 ఎకరాల్లో వివిధ పంటల ను సాగుచేశారు. ఈ లెక్కన యాసంగి సాధారణసాగులో 73శాతం సాగు పూర్తయింది. ఆహార, వాణిజ్యపంటలు కలిపి త్వరలోనే వందశాతం సాగు లక్ష్యం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వరిని సాగు చేయవద్దని చెప్పినా, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా రైతులు మాత్రం వరి సాగును ఆపలేదు. తిండి గింజల కోసముంటూ నీటి వసతి ఉన్న చోట వరిని సాగుచేస్తున్నారు. జిల్లాలో వరి యాసంగి సాధారణ సాగు 1,41,880 ఎకరాలు కాగా ఇప్పటికి 1,12,618 ఎకరాల్లో వరిని సాగు చేశారు. గత సంవత్సరం యాసంగిలో 2,4,692 ఎకరాల్లో వరిని వేశారు.

ఇతర పంటల సాగు వివరాలు..

పచ్చ జొన్న 658 ఎకరాలు, మొక్కజొన్న 45,248 ఎకరాలు, ప్రధాన చిరు ధాన్యాలు 45,908 ఎకరాలు, తృణధాన్యాలు 45,908 ఎకరాల్లో సాగుచేశారు. కందులు 90ఎకరాలు, పెసలు 13,317 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అపరాలు 6,838 ఎకరాలు, వేరుశనగ 3,757, నువ్వులు 455, పొద్దుతిరుగుడు 44ఎకరాల్లో సాగు చేశారు. యాసంగిలో ఆహార పంటల సాధారణ సాగు 9,837 ఎకరాలు కాగా ప్రస్తుతానికి 4,385 ఎకరాలు, ఆహారేతర పంటల సాధారణసాగు 4,886 ఎకరాలు కాగా 410ఎకరాల్లో సాగు చేశారు.                                        

Updated Date - 2022-02-19T06:29:57+05:30 IST