50 నెలలు.. 9మంది కమిషనర్లు

ABN , First Publish Date - 2022-09-30T05:25:28+05:30 IST

వైరా మునిసిపాలిటీలో కమిషనర్ల వెతలు చోటుచేసుకున్నాయి. ఈ మునిసిపాలిటీ ఏర్పడిన 50 నెలల కాలంలో ఇప్పటివరకు తొమ్మిది మంది కమిష నర్లు పనిచేశారు.

50 నెలలు.. 9మంది కమిషనర్లు
వైరా మునిసిపాలిటీ కార్యాలయం

పదో కమిషనర్‌ వేటలో వైరా మునిసిపాలిటీ 

ఇప్పటి వరకూ ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్న పురపాలకం

వైరా, సెప్టెంబరు 29: వైరా మునిసిపాలిటీలో కమిషనర్ల వెతలు చోటుచేసుకున్నాయి. ఈ మునిసిపాలిటీ ఏర్పడిన 50 నెలల కాలంలో ఇప్పటివరకు తొమ్మిది మంది కమిష నర్లు పనిచేశారు. ఇప్పుడు మళ్లీ పదో కమిషనర్‌ కోసం మునిసిపాలిటీ వేట మొదలైంది. ఏ ముహూర్తాన వైరా మునిసిపాలిటీ ఆవిర్భవించిందో కానీ ఇంకా బాలారిష్టాల ను అధిగమించలేకపోతుంది. ఈ మునిసిపాలిటీకి ఇంతవ రకు కమిషనర్‌ పోస్టే మంజూరు కాలేదు. అయినప్పటికీ లేని పోస్టులో కమిషనర్లుగా అధికారులను ప్రభుత్వం నియమిస్తూ వస్తోంది. ఈ కమిషనర్లు కూడా ఇప్పటి వరకు తొమ్మిది మంది మారారు. ప్రస్తుతం వైరా కమిషన ర్‌గా వ్యవహరిస్తున్న ఎంపీడీవో ఎన్‌.వెంకటపతి రాజు శు క్రవారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో కమిషనర్‌ పోస్టు ఖాళీ అవుతుంది. కొత్త కమిష నర్‌ కోసం మునిసిపల్‌ పాలకవర్గం, జిల్లా అధికారులు వెతుకులాట మొదలుపెట్టారు. దాని కోసం వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు పనిచేసిన తొమ్మిదిమంది కమిషనర్‌లు మునిసి పాలిటీపై అవగాహన రాకముందే బదిలీ, ఉద్యోగ విరమణ చేశారు.

ఇప్పటివరకు తొమ్మిది మంది కమిషనర్లు

2018 ఆగస్టు ఒకటిన వైరా మునిసిపాలిటీ ఏర్పడింది. వైరా, కొణిజర్ల మండలాల పరిధిలో 30వేల పైచిలుకు జనాభాతో 20 వార్డులతో ఉంది. మునిసిపల్‌ చైర్మన్‌గా టీ ఆర్‌ఎస్‌కు చెందిన సూతకాని జైపాల్‌తోపాటు పాలకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం 50 నెలల కాలంలో తొమ్మిదిమంది కమిషనర్లుగా పనిచేశారు. ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న జాకీర్‌ హుస్సేన్‌ మొదట వైరా కమిషనర్‌గా 2018 ఆగస్టు 2న బాధ్యతలు చేపట్టారు. ఆయన 2019 ఫిబ్రవరి 15 వరకు కేవలం ఆరునెలల కాలం పనిచేశారు. వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు జాకీర్‌ హుస్సేన్‌ బదిలీ అ య్యారు. ఆ తర్వాత వైరా తహసీల్దార్‌గా ఉన్న జె.సంజీవ 2019 ఫిబ్రవరి 16 నుంచి అదే సంవత్సరం మే 24 వరకు కేవలం మూడు నెలల పాటు ఇన్‌చార్జి కమిషనర్‌గా పని చేశారు. ఆతర్వాత ఖమ్మం నగర కార్పొరేషన్‌కు చెందిన సీతారామచంద్రరావు మే 25న మూడో కమిషనర్‌గా బా ధ్యతలు చేపట్టారు. ఆగస్టు 31వరకు ఇక్కడ పనిచేశారు. ఆయన ఉద్యోగ విరమణ చేశారు. దాంతో వైరా మునిసి పాలిటీలో ఇన్‌చార్జ్‌ ఏఈగా పనిచేసిన హుస్సేన్‌ సెప్టెం బరు 1నుంచి అక్టోబరు 18వరకు ఎలాంటి అధికారాలు లేకుండా ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించా రు. ఆతర్వాత ఖమ్మం నగర పాలకసంస్థలోని సూపరిం టెండెంట్‌ ఆర్‌.విజయానంద్‌ 2019 అక్టోబరు 19న ఇక్కడ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2020 మే 31వరకు విధులు నిర్వహించారు. ఆయన స్థానంలో అదే ఏడాది జూన్‌ 1న ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ డీఈ వి.శ్రీనివా సరావు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేవలం ఐదునెలలు మాత్రమే ఇక్కడ ఇన్‌చార్జి కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం మునిసి పాలిటీ ప్రజారోగ్యశాఖ డీఈగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సెప్టెంబరులో వైరా ఎంపీడీవో ఎన్‌.వెంకటప తిరాజును ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఆయన స్థానంలో 2021 ఫిబ్రవరిలో మణుగూరు మునిసిపాలిటీ కమిషనర్‌గా ఉన్న వెంకటస్వామిని నియమించారు. పోస్టు లేకపోయినప్పటికీ రెగ్యులర్‌ కమిషనర్‌ అయిన వెంకట స్వామి ఇక్కడకు వచ్చారు. అయితే ఆయన ఏకపక్ష నిర్ణ యాలపై కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. ఆయనను బదిలీ చే యించారు. తిరిగి ఆయన స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవ రిలో మళ్ళీ ఎంపీడీవో ఎన్‌.వెంకటపతిరాజును మునిసిపల్‌ కమిషనర్‌గా జిల్లా కలెక్టర్‌ నియమించారు. ఆయన నాలుగేళ్ల సర్వీస్‌ ఉన్నప్పటికీ ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) తీసుకున్నారు. ఈనెల 30న ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈనేపథ్యంలో ఇక్కడి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సమర్థుడైన అధికారిని నియమించేందుకు కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌, అద నపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.


Updated Date - 2022-09-30T05:25:28+05:30 IST