నూతన విద్యావిధానంతో పేదలకు విద్యదూరం

ABN , First Publish Date - 2022-12-31T23:33:56+05:30 IST

ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం సాయంత్రం ముగిశాయి. రాష్ట్ర నలుమూలలనుంచి ఈ మహాసభలకు ప్రతినిథులు హాజరయ్యారు. శనివారం మహాసభల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నూతన విద్యావిధానంతో పేదలకు విద్యదూరం
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి,

09kmm31maha-sabhalu.jpgసభకు హాజరైన ప్రతినిధులు

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ఖమ్మంలో ముగిసిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు

ఖమ్మం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం సాయంత్రం ముగిశాయి. రాష్ట్ర నలుమూలలనుంచి ఈ మహాసభలకు ప్రతినిథులు హాజరయ్యారు. శనివారం మహాసభల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న నూతన విద్యావిధానం వల్ల పేదలకు మెరుగైన విద్య అందడంలేదన్నారు. చిన్నగదుల్లో అంగనవాడీ కేంద్రాల నిర్వాహణ వల్ల బాలలకు, గర్భిణులకు తగిన పౌష్టికాహారం అందడంలేదన్నారు. నూతన విద్యావిధానంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ప్రాథమిక విద్యను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నంలో భాగమే నూతన విద్యావిధామని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలలో మనువాద భావజాలం విద్యార్థులకు బోధించడం ఆందోళనకరమన్నారు. ముగింపు సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా డిసెంబరు 29న ఖమ్మంలో భారీబహిరంగసభ నిర్వహించారు. భక్తరామదాసు కళాక్షేత్రంలో రెండురోజులపాటు ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సభల్లో కూడా జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొని రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల స్థితిగతులను సమీక్షించారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి పలు తీర్మానాలు చేశారు.

187మందితో నూతన కమిటీ ఎన్నిక

ఖమ్మంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహసభల్లో 187మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులుగా జి.నాగయ్య, ఆర్‌.వెంకటరాములు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా తమ్మినేని వీరభద్రం, పి.వెంకటేశ్వరరావు, ములకలపల్లి రాములు, ఎం. ఆంజనేయులు, పెద్ది వెంకటరాములు, అల్వాల వీరయ్య, లంకా రాములు, నర్సింహులు, సమ్మయ్య, కార్యదర్శులుగా నారి అయిలయ్య, పద్మ, మెచ్చా వెంకటేశ్వర్లు, కొండమడుగు నర్సింహా, ఎం.వెంకటయ్య, యు.గోపాల్‌, వెంకటరాజు, కె.జగన, ఆర్‌. శశిధర్‌, సాంబశివ ఎన్నికయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో ఫిబ్రవరి 15నుంచి 18వరక జరగబోయే భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు కూడా ఈ సభలో ప్రతినిధులను ఎన్నుకున్నారు.

Updated Date - 2022-12-31T23:34:00+05:30 IST