చంద్రబాబు సభకు విస్తృత ప్రచారం
ABN , First Publish Date - 2022-12-15T01:08:24+05:30 IST
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీని బలోపేతం చేసేందుకు ఈనెల 21న ఖమ్మంలో ఆ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నామని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.
వాహనాలను ప్రారంభించిన నేతలు
నియోజక వర్గాల్లోనూ శ్రేణుల ర్యాలీలు
ఖమ్మం మామిళ్లగూడెం, డిసెంబరు 14: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీని బలోపేతం చేసేందుకు ఈనెల 21న ఖమ్మంలో ఆ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నామని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఖమ్మంలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో జన సమీకరణ తో పాటు టీడీపీ చేసిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేస్తున్నామని, ఇందుకుగాను 34 ప్రచార వాహనాలను సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కేతినేని హరీ్‌షతో పాటు తెలుగుయువత నాయకులు చంద్రహాస్, గుత్తా సీతయ్య, నల్లమల రంజిత, టీడీపీ ఖమ్మం నగర అధ్యక్షుడు వడ్డెం విజయ్, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సభ నేపథ్యంలో నగరాన్ని పసుపుమయం చేసేందుకు పార్టీ జెండాలు, పసుపు తోరణాలను సిద్ధం చేస్తున్నారు. అలా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచార ర్యాలీలు నిర్వహించారు.