స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నియామకమెప్పుడు?

ABN , First Publish Date - 2022-11-23T00:27:56+05:30 IST

జిల్లా పాఠశాల క్రీడల నిర్వహణ కార్యదర్శి నియామకం మూడేళ్ల నుంచి కరోనా కారణంగా నియమించలేదు. ఈ ఏడాదైనా కార్యదర్శి నియామకం చేపట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కార్యదర్శి నియామకం చేపట్టకపోవడం గమనార్హం.

స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నియామకమెప్పుడు?

అండర్‌ - 14, 17 క్రీడాకారుల ఆందోళన

చుంచుపల్లి, నవంబరు 22: జిల్లా పాఠశాల క్రీడల నిర్వహణ కార్యదర్శి నియామకం మూడేళ్ల నుంచి కరోనా కారణంగా నియమించలేదు. ఈ ఏడాదైనా కార్యదర్శి నియామకం చేపట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కార్యదర్శి నియామకం చేపట్టకపోవడం గమనార్హం. రాష్ట్రంలో అన్ని జిల్లాలో కార్యదర్శి నియామకం జరిగినా జిల్లాలో మాత్రం నియామకం చేపట్టలేదు. కరోనా కారణంగా మూడేళ్లుగా పాఠశాల క్రీడలు నిర్వహించలేదు.

నష్టపోతున్న అండర్‌ - 14, 17 విద్యార్థులు

రెండేళ్లుగా విద్యార్థులు ఆటలో పాల్గొనకుండానే పాఠశాల స్థాయి నుంచి బయటకు వచ్చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ఈ ఏడాది పాఠశాల క్రీడా నిర్వహణ కార్యదర్శి నియామకం జరపాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా విద్యాశాఖలో చలనం లేదు. ఖమ్మం జిల్లాలో గత నెలలో నియామకం చేపట్టినప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం దాని ఊసే లేకుండా పోయింది. జిల్లా కార్యదర్శి నియామకంలో జిల్లా విద్యాశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

నిర్లక్ష్యం నీడన జిల్లా క్రీడలు

అతిపెద్ద ఏజెన్సీ జిల్లా క్రీడాకారుల గనిగా పేరు ప్రఖ్యాతలు గడిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి నుంచి క్రీడల పట్ల నిర్లక్ష్యం థోణిలో వ్యవహరిస్తుందనే అపవాదు ఉంది. క్రీడాకారులకు పునాది లాంటి పాఠశాల క్రీడల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాటి ఫలితాలు క్రీడల భవిష్యతపై పడే అవకాశాలు ఉన్నాయని క్రీడాకారులు వారి తల్లిదండ్రులు, కోచలు లబోదిబో మంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటిస్తున్న వాటిని సరై పద్దతిలో నిర్వహించే నాధుడే కనుచూపుమేర కనపడటం లేదని ఇలాంటి సంఘటన వల్ల క్రీడాకారుల భవిష్యత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైన జిల్లా యంత్రాంగం క్రీడాకారుల పట్ల ఒక ప్రణాళిక బద్దంగా వివిధ క్రీడా టోర్నమెంట్లను నిర్వహించి వారిని ప్రోత్సహించాలని వారి భవిష్యతకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉంది.

కార్యదర్శి నియామకం చేపడతాం

సోమశేఖర శర్మ, భద్రాద్రి డీఈవో

భద్రాద్రి జిల్లా పాఠశాల క్రీడల నిర్వహణ కార్యదర్శి నియామకంలో ఆలస్యమైన మాట వాస్తవమే. కానీ రెండు, మూడు రోజుల్లో కార్యదర్శి నియామకం చేపట్టి పాఠశాల క్రీడలు సజావుగా జరిగేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తాం.

Updated Date - 2022-11-23T00:27:56+05:30 IST

Read more