Reception: కనీ వినీ ఎరుగని రీతిలో పొంగులేటి కుమార్తె రిషెప్షన్ వేడుక

ABN , First Publish Date - 2022-08-17T20:45:20+05:30 IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె రిషెప్షన్ వేడుక ఖమ్మంలో జరుగుతోంది.

Reception: కనీ వినీ ఎరుగని రీతిలో పొంగులేటి కుమార్తె రిషెప్షన్ వేడుక

ఖమ్మం (Khammam): మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె రిషెప్షన్ వేడుక ఖమ్మంలో జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీ వినీ ఎరుగని రీతిలో వేడుక జరుపుతున్నారు. ఏడు లక్షల కుటుంబాలకు గోడ గడియారం, పెళ్లి కార్డు ఇచ్చి మరీ ఆహ్వానించారు. ఈ నెల 12న ఇండోనేషియా బాలిలో పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డిఈల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వివాహ రిషెప్షన్ మాత్రం ఖమ్మం, ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని వంద ఎకరాల్లో నిర్వహిస్తున్నారు.


సినీ టెక్నిషియన్స్‌తో నిర్మించిన రాజస్థాన్ ప్యాలెస్ సెట్టింగ్‌లో రిషెప్షన్ వేడుక జరుగుతోంది. ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ మల్లిఖార్జున ఆధ్వర్యంలో ఈ సెట్టింగ్ నిర్మాణం జరిగింది. ఈ వేడుకలో సుమారు 3 లక్షల మంది అతిథులు భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి తెలంగాణ వంటకాలు రుచి చూపించిన యాదమ్మతో ప్రత్యేకంగా వంటలు తయారు చేయించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా భోజనాలు వడ్డిస్తున్నారు.

Updated Date - 2022-08-17T20:45:20+05:30 IST