చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-03-06T04:48:28+05:30 IST

ఆర్‌వోబీ కింద జీవనోపాది పొందుతున్న చిరు వ్యాపారులకు అన్ని విదాలుగా తమ పార్టీ అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం భరోసా ఇచ్చారు.

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామనాఽథం

బోనకల్‌, ఫిబ్రవరి 5: ఆర్‌వోబీ కింద జీవనోపాది పొందుతున్న చిరు వ్యాపారులకు అన్ని విదాలుగా తమ పార్టీ అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం భరోసా ఇచ్చారు. బోనకల్‌ గ్రామానికి శనివారం వచ్చిన ఆయనను చిరు వ్యాపారులు కలిసి బడ్డీలను తొలగించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా పలు రకాల వృత్తుల పై ఆదారపడి జీవనం సాగిస్తున్న తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వ్యాపారులు తెలుపగా ఈ సమస్య గురించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని రామనాధం తెలిపారు. బడ్డీల తొలగింపు విషయాన్ని పరిశీలిస్తామని హామి ఇచ్చినట్లు పేర్కొన్నారు. వ్యాపారులు అంతా కలిసి దైర్యంగా ఉండాలని టీడీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ, శివ్లా నాయక్‌, మైనేని రవి కుమార్‌, బండి రామారావు, నాగమల్లేశ్వరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-06T04:48:28+05:30 IST