రక్షిత నీటి పథకాలపై నిర్లక్ష్యమేల..?

ABN , First Publish Date - 2022-03-06T03:53:39+05:30 IST

పట్టణ వ్యాప్తంగా 20వేల పైచిలుకు నివాస, వాణిజ్య సముదాయాల్లో జీవనం సాగి స్తున్న లక్ష పైచిలుకు జనభాతో పాటు వివిద వ్యాపకాలతో జిల్లా కేంద్రానికి విచ్చేసే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా నాలుగు ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి.

రక్షిత నీటి పథకాలపై నిర్లక్ష్యమేల..?
మునిసిపల్‌ కాంప్లెక్స్‌లో బోరు వేస్తున్న దృశ్యం

లోపించిన అధికారుల పర్యవేక్షణ

కొత్తగూడెం టౌన్‌, మార్చి 5: పట్టణ వ్యాప్తంగా 20వేల పైచిలుకు నివాస, వాణిజ్య సముదాయాల్లో జీవనం సాగి స్తున్న లక్ష పైచిలుకు జనభాతో పాటు వివిద వ్యాపకాలతో జిల్లా కేంద్రానికి విచ్చేసే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా నాలుగు ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో చేతిపంపులు ఏర్పాటుచేశారు. నిత్యం సరఫరా చేయాల్సిన తాగునీరు వారంలో రెండుసార్లు మా త్రమే విడుదల చేస్తున్నారు. వేసవి తాపం మొదలైంది.  ఈ సంవ త్సరం వర్షాకాలంలో వర్షాలు సమృద్దిగా కురిసిన నేపధ్యంలో పట్టణంలో తాగునీటి ఎద్దడి ఉండదనుకుంటే పొరపాటే. యావత్‌ పట్టణమంతా తెలంగాణ మునిసిపల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నిధుల (టీఏండీపీ)తో ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ల అనుసంధానం.. త్రాగునీటి సరఫరాలో లీకేజీల సమస్యలు పుర ప్రజలను వేధిస్తున్నాయి. కొన్ని వా ర్డుల్లో తాగునీటి సరఫరాపై అఽధికారులు, పాలకుల అజమాయిషీ నామమాత్రం అయ్యింది. లీకేజీల బెదడ వేధిస్తుంది. ట్యాంకులను శుభ్రం చేసే విషయంలో పారద ర్శకత కొరవడింది. ఫిల్టర్‌బెడ్‌ నిర్వహణ అటకెక్కింది. పుర పాలక పరిధిలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరందిం చేందుకు ఇంట్రాపైప్‌లైన్‌ నిర్మాణం కోసం రూ.44కోట్లు మంజూరయ్యాయి. సంవత్సరాల తరబడి పనులు కొనసా గుతూనే ఉన్నాయి. పురపాలక కార్యాలయంలో నీటి ఎద్దడి నివారణకు బోరు వేసిన అధికారులు పట్టణ వాప్తంగా ఉన్న వనరుల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

ఫిల్టర్‌ నిర్వహణ శూన్యం..

 పురప్రజలకు శుద్దజలాలను అందించడంలో ఫిల్టర్‌బెడ్‌ నిర్వహణ కీలకమైనది. పురపాలక ఫిల్టర్‌బెడ్‌ నిర్వహణలో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇసుకను మార్చాలి. నీటిని శుద్ది చేయడ ంలో ఇసుకదే ప్రధాన పాత్ర. కానీ ఏళ్ల తరబడి ఫిల్టర్‌బెడ్‌ల నిర్వహణ అటకెక్కింది. ఫిల్టర్‌బెడ్‌ను 8.45ఎం.ఎల్‌.డి సామర్ధ్యంతో నిర్మించారు. నెలకు నిర్వహ ణకు రూ. 25లక్షలు ఖర్చు చేస్తున్నారు. పట్టణంలో మొ త్తం 8877 నల్లా కనక్షన్లు ఉన్నాయి. 8 మంచినీటి ట్యాంకు లున్నాయి. పిల్టర్‌బెడ్‌లో ఇసుకను పదేళ్ల క్రితం మార్చారు. పిల్టర్‌ బెడ్‌లో ఉన్న నాలుగు బెడ్ల లో ఇసుక మార్చేందుకు కౌన్సిల్‌లో చర్చించి కేటాయించిన రూ.30లక్షల గతేదాడి అ మోదం పొందిన నేటివరకు కార్యరూపం దాల్చలేదు. బో యర్‌ మిషన్‌ వాడకాన్నే మర్చిపోయారు. నీరు శుద్ది చేయా లంటే ఈ మిషన్‌తో ఇసుకను కదిలించాలి. కిన్నెరసాని హెడ్‌ ఓవర్స్‌ నుంచి వచ్చే రా వాటర్‌ను శుద్దిచేసే క్లారిఫో క్యూలేటర్‌ పనికిరాకుండా పోయింది. సంవత్సరాలు గడు స్తున్నా వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసే వారే కరువయ్యారు. మోటర్‌ స్టాడింగ్‌ సదుపాయం లేదు. తరచుగా 150హెచ్‌పీ మోటర్లు మరమత్తులకు గుర వుతున్నాయి. ఆధునిక పరకరాలను సమకూర్చడంలో అధి కారులు, పాలకులు విఫలమవుతున్నారు. ఫిల్టర్‌బెడ్‌ సంద ర్శనకు అనుమతులు లేవు. ఈ తతంగమంతా బయటకు పొక్కుతుందని ఆంక్షలు విదించారు. ఫిల్టర్‌బెడ్‌ సమీపంలో చిట్టడవిని తలపించేలా ఉండటంతో పాముల బెడదతో బి క్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. 

లోపించిన పర్యవేక్షణ..

మునిసిపల్‌ ప్రజల ఆర్యోగం దృష్ట్యా కేటాయించిన అసిస్టెంట్‌ స్టార్టిటికల్‌ అధికారి (ఏఎస్‌ఓ) పోస్టు ఖాళీగా దర్శనమిస్తోంది. ఈయన పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ఆయా వార్డులను సందర్శించి తాగునీటి సరఫరా విషయం లో అవసరమైన సలహాలు, సూచనలు అందించాల్సి ఉన్న మచ్చుకైనా కానరావడం లేదు. పుర అధికారులు నీటి నాణ్యత ప్రమాణలపై అర్‌డబ్ల్యూఎస్‌ అఽధికారులతో సంప్ర దించాలి. ఇవన్నీ రికార్డుల్లో నమోదు చేయాల్సిన అవసరం ఉన్నా కొంతకాలంగా వీటిని పక్కన పెట్టేశారు. విద్యుత్‌ సరఫరా ఉంటే కిన్నెరసాని నుంచి ఫిల్టర్‌బెడ్‌కు నీటిని తరలిస్తున్నారు. కలెక్టర్‌ అనుదీప్‌ మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయాలని ఆదేశించిన తరువాత కొన్ని రోజులు శుభ్రం చేసి మమ అనిపించారనే ఆరోపణలున్నాయి. 


Updated Date - 2022-03-06T03:53:39+05:30 IST