చివరి ఆయకట్టుకూ సాగునీరందిస్తాం

ABN , First Publish Date - 2022-12-31T22:46:13+05:30 IST

బీబీసీ ఆయకట్టు పరిధిలోని చివర భూముల వరకు సాగునీరు అందించేలా చూస్తామని ఇరిగేషన్‌ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌ నాయక్‌ తెలిపారు. బోనకల్‌ ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శనివారం నీటి లభ్యత-వినియోగం పై ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

చివరి ఆయకట్టుకూ సాగునీరందిస్తాం
బీబీసీ కెనాల్‌ను పరిశీలిస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌నాయక్‌

బోనకల్‌, డిసెంబరు 31: బీబీసీ ఆయకట్టు పరిధిలోని చివర భూముల వరకు సాగునీరు అందించేలా చూస్తామని ఇరిగేషన్‌ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌ నాయక్‌ తెలిపారు. బోనకల్‌ ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శనివారం నీటి లభ్యత-వినియోగం పై ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీబీసీకి 1,250 క్యూసెక్కుల నీటి విడుదలను వారబందీ విధానంలో నిరంతరంగా సరఫరా చేస్తామన్నారు. బీబీసీ పరిధిలో బోనకల్‌ మండలంతో పాటు మధిర మండలాల రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని అందించేందుకు గానూ పాలేరు డివిజన్‌ ఈఈ మంగలపుడి వెంకటేశ్వర్లును నోడల్‌ అదికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. రబీ సీజన్‌లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటలకు నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం బీబీసీ కాలువ పై పర్యటించారు. కాలువల స్థితిగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కన్వీనర్‌ వేమూరి ప్రసాద్‌, డీఈలు శ్రీనివాసరావు, రాంప్రసాద్‌, నాగబ్రహ్యాయ్య, సంతోష్‌, జేఈలు రాజేష్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:46:14+05:30 IST