వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-03-06T04:37:04+05:30 IST

చలువ పందిళ్ల.. మామిడి తోరణాలు... మేళతాళాలు... వేదమంత్రోచ్ఛారణలతో శ్రీమన్నారాయణుడి కల్యాణ మహోత్సవం వైభవోతపేతంగా సాగింది.

వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం
స్వామి వారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మణుగూరు, మార్చి 5 : చలువ పందిళ్ల.. మామిడి తోరణాలు... మేళతాళాలు... వేదమంత్రోచ్ఛారణలతో శ్రీమన్నారాయణుడి కల్యాణ మహోత్సవం వైభవోతపేతంగా సాగింది. మణుగూరు ఏరియాలోని పీవీకాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయం  భక్త జనసంద్రంగా మారింది. ఎక్కడ చూసినా భక్తజన సందోహాంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఆలయ సప్తమ వార్షికోత్సవం సందర్భంగా స్ధానిక కార్మికులు అధికారులు అంతా కలసి నిర్వహిస్తున్న బ్రహోత్సవాల్లో భాగంగా మూడో రోజున శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి వచ్చే భక్తులకు ముఖ ద్వారం వద్ద సాంప్రదాయ బద్దంగా శ్రీహరి నామాలు బొట్టుగా పెటి వలంటీర్లు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారి సన్నిధి ముందు మండపంలో కల్యాణాన్ని నిర్వహించారు. ఏరియా జీఎం జక్కం రమేష్‌ వాణి దంపతలు, ఎస్వోటూ జీఎం లలిత్‌ కుమార్‌ దంపతులతో పాటు ఏరియాలోని పలుశాఖల ఉన్నతాఽ దికారులు, సూపర్‌వైజర్లు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు కల్యాణంలో పాల్గొన్నారు. స్వామి వారి కల్యాణానికి సహ కరించిన ప్రతీ ఒక్కరికి ఏరియా జీఎం రమేష్‌ ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ శేషగిరిరావు, లక్ష్మిపతి గౌడ్‌, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు ప్రభాకర్‌, పిచ్చేశ్వరరావు పాల్గొన్నారు.


Read more