పరిశోధనల నిలయం అటల్‌ల్యాబ్‌

ABN , First Publish Date - 2022-11-27T22:12:19+05:30 IST

వినూత్న ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, సమస్యల పరిష్కారం, పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రసాంకేతిక రంగాల అభిరుచి, ఆసక్తి పెంపుదల లక్ష్యంగా నీతి ఆయోగ్‌ ద్వారా అటల్‌ ఇన్నోవేషన మిషన(ఏఐయం)పథకం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలోనే అమలవుతోంది.

పరిశోధనల నిలయం అటల్‌ల్యాబ్‌
ఇల్లెందు సింగరేణి పాఠశాలలో నెలకొల్పిన నీతి ఆయోగ్‌ అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌

ఇల్లెందు సింగరేణి పాఠశాలలో వినూత్న పథకం

నీతి ఆయోగ్‌ అటల్‌ ఇన్నోవేషన మిషన ద్వారా నిర్వహణ

ఇల్లెందు, నవంబరు 27: వినుత్న ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, సమస్యల పరిష్కారం, పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రసాంకేతిక రంగాల అభిరుచి, ఆసక్తి పెంపుదల లక్ష్యంగా నీతి ఆయోగ్‌ ద్వారా అటల్‌ ఇన్నోవేషన మిషన(ఏఐయం)పథకం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలోనే అమలవుతోంది. జిల్లాస్థాయి పాఠశాలల విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు(సైన్స ఫెర్‌)జరిగిన ప్రాంగణంలోనే అటల్‌ ఇన్నోవేషన మిషన ఏర్పాటు చేసిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ఉండడంతో భారీగా సందర్శకులు తిలకించారు. విద్యార్థుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల, జీవణ ప్రమాణాలు పెంపొదించే వినూత్న ఆవిష్కరణలు, ఆచరణీయ రంగాలను అభివృద్ధి చేసే అభిరుచి, ఆసక్తులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2020లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను ఇల్లెందు సింగరేణి ల్యాబ్‌లో ఏర్పాటు చేసింది.

నెలకొల్పడానికి అర్హతలు

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను నెలకొల్పడానికి నీతి ఆయోగ్‌ అటల్‌ ఇన్నోవేషన మిషనలు దశాబ్ధ కాలంగా దరఖాస్తు చేసే పాఠశాలలో ఉత్తీర్ణత, వైజ్ఞానిక ప్రదర్శనల్లో భాగస్వామ్యం, సాధించిన అవార్డులు, స్థలం, ఇనస్పైర్‌లో ప్రతిభ నైపుణ్యలు, రాష్ట్ర, దక్షణాది రాష్ట్రాల సైన్సఫెర్‌లలో ప్రాతినిఽధ్యాలను పరిగణలోకి తీసుకుంటుంది. కనీసం 600మంది విద్యార్థులు ఉండాలి. ఈ తరహాలో జిల్లాలో మంజూరైన రెండు ల్యాబ్‌లలో అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్న, నిర్వహిస్తున్న ఇల్లెందు సింగరేణి ఉన్నత పాఠశాల కావడం, ఇదే పాఠశాలలో ఇప్నటి వరకు మూడుసార్లు జిల్లాస్థాయి సైన్సఫెయిర్‌ నిర్వహించడం విశేషం. ఈ పథకాన్ని ఇల్లెందు సింగరేణి పాఠశాలలో 2020లో ప్రారంభించారు.

రూ.12 లక్షలతో పరిశోధన పరికరాలు

నీతి ఆయోగ్‌ అటల్‌ ఇన్నోవేషన మిషన ఈ పథనం కింద ఎంపిక చేసిన పాఠశాలకు ప్రభుత్వం రూ.12లక్షలు అందజేస్తుంది. వీటిలో రూ.10లక్షలతో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ నిర్మాణం, మెటీరియల్‌కు రూ.2లక్షలు నిర్వహణకు వినియోగించాలి. ఈ మేరకు సింగరేణి ఎలకా్ట్ర్ట్రనిక్‌ పరికరాలు, రోబోట్స్‌, త్రీడీ ప్రీంటర్‌, టెలిస్కోప్‌, మూడు ల్యాబ్‌ ట్యాప్‌లు, ప్రొజెక్టర్‌, మైక్రోస్కోప్‌, సైన్స మెటీరియల్‌ ఏర్పాటు చేయడం గమనార్హం. గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అమలు చేస్తుండడంతో ఉచితంగా పాఠశాల విద్యార్థులు డ్రోనల వినియోగం, త్రీడీ ప్రిటీంగ్‌లు, టెలిస్కోప్‌, మైక్రోస్కోప్‌లు, రోబోటిక్‌ల వినియోగం, సర్కూట్స్‌, సోల్డరీంగ్‌లో శిక్షణ పొందారు. అధునాతన హంగులతో నిర్మించిన ఈ ల్యాబ్‌లోకి ప్రవేశించగానే విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలు, సాధించిన విజయాలు గుర్తించే రీతిలో వివిధ అంశాలు ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌ నిర్మాణంలో సింగరేణి యాజమాన్యం కూడా తోడ్పాటు అందించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాటిలేని విజ్ఞాన శాసా్త్రల పరిశోధనల కేంద్రంగా ఇది రూపొందింది. జిల్లా సైన్సఫెయిర్‌ సందర్భంగా పాఠశాలను సందర్శించిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోత హరిప్రియ, సింగరేణి జీఎం షాలేము రాజు తదితర ప్రజాప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. సందర్శకులు సైతం ఆసక్తిగా ల్యాబ్‌ గురించి తెలుసుకున్నారు.

Updated Date - 2022-11-27T22:12:20+05:30 IST