ముగిసిన జిల్లాస్థాయి సైన్సఫెయిర్‌

ABN , First Publish Date - 2022-12-16T01:30:15+05:30 IST

ఖమ్మం నగరంలోని సెయింట్‌జోసెఫ్‌ పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సైన్సఫెయిర్‌, ఇనస్పెయిర్‌ గురువారంతో ముగిసింది. చివరిరోజు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు సైన్సఫెయిర్‌లో ప్రదర్శించిన ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు.

ముగిసిన జిల్లాస్థాయి సైన్సఫెయిర్‌

నమూనాలను పరిశీలించిన పలు పాఠశాలల విద్యార్థులు

ఖమ్మం ఖానాపురంహవేలి, డిసెంబరు 15: ఖమ్మం నగరంలోని సెయింట్‌జోసెఫ్‌ పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సైన్సఫెయిర్‌, ఇనస్పెయిర్‌ గురువారంతో ముగిసింది. చివరిరోజు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు సైన్సఫెయిర్‌లో ప్రదర్శించిన ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు. ప్రదర్శించిన 506 నమూనాలు, 82 ఇనస్పెయిర్‌ ఎగ్జిబిట్స్‌ను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మూడురోజులుగా విద్యార్థులకు జిల్లా ప్రైవేటు స్కూల్‌ అసోసియేషన కరస్పాండెంట్లు భోజన వసతి కల్పించారు. ఈ ముగింపు సమావేశానికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఇనచార్జి డీఈవో సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న వైజ్ఞానిక చైతన్యాన్ని సైన్సుఫెయిర్‌ వెలికితీస్తుందన్నారు. ఈ సైన్సుఫెయిర్‌, ఇనస్పెయిర్‌లలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేయాలని విద్యార్థులకు సూచించారు. మన జీవితం సైన్సుతో ముడిపడి ఉందని, ప్రతి విషయంలో సైన్సు దాగి ఉందని, దానిని విద్యార్థులు గుర్తించి మీ పక్కవారికి, గ్రామీణ ప్రాంతాల వారికి తెలియపరచాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్సు అధికారి సైదులు, ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన కోశాధికారి రామచంద్రరావు, అర్బన ఎంఈవో శ్రీనివాస్‌, సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల కరస్పాండెంట్‌ నక్షత్ర,ప్రాజెక్టులను పరిశీలిచిన జ్యూరీ మెంబర్స్‌తోపాటు ప్రధానోపాధ్యాయులు కనపర్తి వెంకటేశ్వర్లు, వై.వెంకటేశ్వర్లుతోపాటు వివిధ పాఠశాలలకు చెందిన సైన్సు అధ్యాపకులు, హెచఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:30:16+05:30 IST