సీతారామ ఆలయ ప్రతిష్ఠోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-05T03:56:57+05:30 IST
కల్లూరు మండలంలోని చెన్నూ రులో నూతనంగా నిర్మించిన సీతారామ చంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠామహోత్స హోమ పూజలు గురువా రం ఘనంగా ప్రారంభమయ్యాయి.
కల్లూరు, ఆగష్టు 4: కల్లూరు మండలంలోని చెన్నూ రులో నూతనంగా నిర్మించిన సీతారామ చంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠామహోత్స హోమ పూజలు గురువా రం ఘనంగా ప్రారంభమయ్యాయి. పూజల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర ఆలయ కమిటీకి రూ.50,116 నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృధ్దికి పలు విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ పాలెపు లక్ష్మీకాంతమ్మ, ఆలయ కమిటీ గౌరవసలహాదారుడు పాలెపు రామారావు, రైతుబంధు ప్రతినిధి పసుమర్తి చందర్‌రావు, ఏఎంసీ వైస్‌చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకులు భాస్కరరావు, రైతుసంఘం మండల అధ్యక్షుడు కర్నాటి జయబాబురెడ్డి, జడ్పీకో-అప్షన్ సభ్యుడు ఎండీ ఇస్మాయిల్, కొరకొప్పు ప్రసాద్, పెడకంటి రామకృష్ణ పాల్గొన్నారు.