చెక్కు చెదరని ప్రజాదరణ టీడీపీది
ABN , First Publish Date - 2022-12-23T23:27:41+05:30 IST
తెలుగుదేశం పార్టీ పేద, బ డుగు, బలహీన వర్గాల పార్టీ అని, నిఖార్సయిన కా ర్యకర్తలు, క్రమశిక్షణ కలిగిన నాయకులకు పుట్టినిల్లని టీడీ పీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు.
పినపాక, డిసెంబరు 23: తెలుగుదేశం పార్టీ పేద, బ డుగు, బలహీన వర్గాల పార్టీ అని, నిఖార్సయిన కా ర్యకర్తలు, క్రమశిక్షణ కలిగిన నాయకులకు పుట్టినిల్లని టీడీ పీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శుక్రవారం పినపాక టీడీపీ మండలాధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అ ధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ స మావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పా ల్గొని మాట్లాడారు. ఖమ్మంలో టీడీపీ జాతీయాధ్యక్షులు నా రా చంద్రబాబునాయుడు దాదాపు దశాబ్ధ కాలం తర్వాత నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనం బ్రహ్మరధం పట్టారన్నారు. నాయకులు స్వార్ధ ప్రయోజనాలకోసం పార్టీ ని వీడి వెళ్లినా, నిఖార్సయిన కార్యకర్తలు, నాయకులు మాత్రం వీడలేదన్నారు. సభకు అశేషంగా తరలివచ్చి, విజ యవంతం చేసిన కార్యకర్తలకు అభిమానులకు, పినపాక మండల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తిరిగి పుంజుకుని, టీడీపీనే ఈ రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించబోతోందని, నిర్ణయాత్మక శక్తిగా ఉండబోతోందన్నారు. టీడీపీ ఎందరో నాయకులను తయారు చేసిందన్నారు. గతాన్ని మరచి కొందరు నాయకులు మా అధినేత చంద్రబాబు పట్ల, టీడీపీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో టీడీపీ మహబూబాబాద్ పార్లమెంటరీ శాఖ కార్యదర్శి వాసిరెడ్డి చలపతిరావు, పినపాక నియోజకవర్గం భాద్యులు వట్టం నారాయణ దొర, బూర్గంపాడు టీడీపీ మండలాధ్యక్షుడు తాళ్లురు జగదీశ్వరరావు, పినపాక టీడీపీ నాయకులు షేక్ నబీ, కొంపల్లి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.